ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

Aug 3 2025 3:24 AM | Updated on Aug 3 2025 3:24 AM

ప్రభు

ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన ఉత్తర్వులు దహనం చేసిన ఏఐఎస్‌ఎఫ్‌

లక్ష్మీపురం(గుంటూరువెస్ట్‌): విద్యార్థుల హక్కులను హరించేలా పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదలచేసిన ఉత్తర్వులను అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌ జీ తీవ్రంగా ఖండించారు. గుంటూరు కొత్తపేట భగత్‌ సింగ్‌ విగ్రహం సర్కిల్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తూ, తక్షణమే వెనక్కి తీసుకోవాల ని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

పొన్నూరు: ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంలో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పొన్నూరు పట్టణ ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. మునిపల్లె గ్రామానికి చెందిన గొడ్డేటి శ్యాంకుమార్‌కు వట్టికూటి సత్య సాయిబాబు, వట్టికూటి వెంకట రామానాయుడు, గుత్తికొండ రాజేష్‌లకు ధాన్యానికి సంబంధించిన సుమారు రూ.40 లక్షల బాకీ విషయంలో వివాదం నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని నేపథ్యంలో శ్యాంకుమార్‌ జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది మే 8వ తేదీన ఆ ఫిర్యాదు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు రావడంతో పోలీసుస్టేషన్‌ ఎదుట ఇరువర్గాలు మాట్లాడుకునే క్రమంలో వాగ్వాదం జరిగింది. తనను కులం పేరుతో దూషించారని శ్యాంకుమార్‌ ఫిర్యాదు చేశాడు. స్టేషన్‌ బయట రోడ్డుపై జరగడంతో శ్యాంకుమార్‌ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి

మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన

వీఐటీ ఏపీ వర్సిటీలో ఘనంగా 8వ విశ్వవిద్యాలయ దినోత్సవం

తాడికొండ: విద్యార్థులు లక్ష్యాలను పెట్టుకొని జీవితంలో ముందుకు నడవాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్‌ అన్నారు. తుళ్లూరు మండలం ఐనవోలులోని వీఐటీ, ఏపీ విశ్వవిద్యాలయంలో 8వ విశ్వవిద్యాలయ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోన శశిధర్‌, గౌరవ అతిథిగా నెక్ట్స్‌ జెన్‌ టాలెంట్‌, విప్రో లిమిటెడ్‌ గ్రూప్‌ హెడ్‌ తిరునావుక్కరసు పళనియప్పన్‌ హాజరయ్యారు. శశిధర్‌ మాట్లాడుతూ అకాడమిక్‌, రీసెర్చ్‌ రంగాలలో బహుమతులు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. తిరునావుక్కరసు మాట్లాడుతూ వీఐటీతో విప్రోకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని, విద్యార్థులు, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి విప్రో కట్టుబడి ఉందన్నారు. వీఐటీ వ్యవస్థాపకుడు, చాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లాడు తూ విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య ను అందిస్తున్నామన్నారు. కోన శశిధర్‌, తిరునావుక్కరసు పళనియప్పన్‌, చాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ చేతులమీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరించారు. 249 అకాడమిక్‌ అవార్డులు, 10 ఎండోమెంట్‌ అవార్డు లు, 260 అధ్యాపక రీసెర్చ్‌ అవార్డులు, 177 రీసెర్చ్‌ స్కాలర్స్‌ అవార్డులు అందించారు. ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన 30 మంది అధ్యాపకులు, ఏడుగురు సిబ్బందిని సత్కరించారు. వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎస్‌.వి.కోటారెడ్డి విశ్వవి ద్యాలయ ప్రగతిని పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా వివరించా రు. వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ విశ్వనాథన్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీష్‌ చంద్ర ముదిగంటి, డిప్యూటీ డైరెక్టర్‌ (స్టూడెంట్‌ వెల్ఫేర్‌) డాక్టర్‌ ఖాదీర్‌ పాషా పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి 1
1/1

ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement