
తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన బళ్లారి
నగరంపాలెం(గుంటూరువెస్ట్): తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బళ్ళారి రాఘవ అని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో శనివారం బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీష్‌కుమార్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ప్రఖ్యాత సాహితీవేత్త, నాటకకారుడు అని అన్నారు. ఆయన రచించిన రఘునందన, హరిశ్చంద్ర, ద్రౌపది వంటి క్లాసిక్ నాటకాలకు నాటకరంగంలో చరిత్రాత్మక స్థానం దక్కాయని చెప్పారు. తెలుగు నాటక రంగానికి నూతన శైలిని పరిచయం చేశారని పేర్కొన్నారు. నాటక ప్రదర్శనల్లోని పాత్రల్లో జీవం పోసే మేటి నటుడిగా పేరు గడించారని అన్నారు. కార్యక్రమంలో ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌లు శంకరరావు, సుభాషిణి, ఎంటీ ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.