కాచి చల్చార్చిన నీరు తాగాలి
డయేరియా బాధితులకు ద్రవ రూపంలో ఉండే మజ్జిగ, పాలు, బార్లీ గంజి, పలచగా తయారు చేసిన సగ్గుబియ్యం, రాగి జావ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, సోయాబీన్స్ రసం, ఇతర పళ్ల రసాలు ఇవ్వొచ్చు. మలమూత్ర విసర్జన తర్వాత, భోజనం చేసే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం చాలా ఉత్తమం. ఇంట్లో వైద్యాలు, మందుల షాపుల వద్దకు వెళ్లి మందులు తెచ్చుకోవడం చేయవద్దు. డయేరియా వచ్చినప్పుడు అర్హత ఉన్న వైద్యనిపుణుడి వద్దకు వెళ్లాలి.
–డాక్టర్ షేక్ నాగూర్ బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు


