Yearly Rasi Phalalu About Leo Horoscope 2023 - Check Astrology Predictions
Sakshi News home page

Simha Rasi Phalalu 2023:ఐశ్వర్య ప్రాప్తి కోసం సింహ రాశి వాళ్లు దీనిని ధరిస్తే మేలు..

Published Mon, Mar 20 2023 12:17 PM

Yearly Rasi Phalalu Leo Horoscope 2023 - Sakshi

సింహ రాశి (ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7)

సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయ తృతీయాలలో కేతువు, సప్తమంలో శని, అష్టమ భాగ్యస్థానాలలో గురు రాహువుల సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సహోదర సహోదరీ వర్గం నుంచి ఆప్యాయతలు లభిస్తాయి. రాజకీయాలలో ఉన్నత పదవులను అందుకోగలుగుతారు. చిన్నపాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు. జీవితంలో ఘనవిజయాలు సాధిస్తారు.

అసమర్థుల మీద జాలిపడి అందలం ఎక్కిస్తారు. ఆ అసమర్థులే అఖండులై మీకు అండగా ఉంటారు. పోటీదారులు ప్రతిచోట మీకు ఎదురుపడ్డా మీకు వచ్చిన నష్టం ఏమీలేదు. వృత్తికి సంబంధించినవన్నీ ఆడంబరంగా ఉండాలని భావిస్తారు. సహోదర సహోదరీ వర్గానికి అన్నివిధాలుగా అండగా ఉన్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు. సొంతవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీకు అవి తప్పులుగా అనిపించవు.

ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని, మేధస్సును సొంతం చేసుకుంటారు. ఎదుటివాళ్ళు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేద్దామనే ఆలోచనే రాదు. సాత్విక స్వభావం, మాట మీద నిలబడే మనస్తత్త్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి అభిషేకానికైనా మహాతీర్థం పొడిలో కొద్దిగా నీళ్ళు కలిపి అభిషేకం చేయండి. ఇష్టదేవతానుగ్రహం కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటారు. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అనుకున్న వాటిని ఏదోరకంగా సాధిస్తారు.

జీవితభాగస్వామి ఆత్మీయులతో కొద్దికాలం చికాకులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. గతంలో మీరు డాక్యుమెంట్స్‌పై చేసిన సంతకాలు వివాదస్పదం అవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు. రచనా, వ్యాసాలు, పుస్తక రచన, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి ఉద్యోగాలలో విశేషమైన నిపుణత ఉంటుంది. మీ మేధస్సు, ఆలోచనలు, శ్రమ ఎక్కువకాలం దోచుకోబడతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ఐశ్వర్యప్రాప్తికి, వృత్తి ఉద్యోగాలలో సానుకూలతకు, వివాహప్రాప్తికి, సంతానప్రాప్తికి లకీ‡్ష్మచందనం ధరించడం వలన మేలు జరుగుతుంది. దాంపత్య జీవితంలో టీకప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి.

పునర్వివాహ యత్నాలు సఫలీకృఋతమవుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయులు, బంధువులు, రక్తసంబంధీకులు స్వదేశానికి రావాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ సంతానానికి విద్యాసంబంధ, ఉద్యోగసంబంధ అవకాశాలు లభిస్తాయి. అరటినారవత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం మంచిది. సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది. రొటేషన్లు, లాభాలు బాగుంటాయి. ఋణాలు తీరుస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి. సామాన్య జనానికి ఉపకరించే ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఖర్చులు తగ్గించే అవకాశం ఉండదు. పొదుపు చేసుకునే అవకాశాలు కనబడవు. అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల చేజార్చుకుంటారు.

వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారం చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. ఆర్థికాభివృద్ధికి కుబేర యంత్రాన్ని ఉపయోగించండి. వృత్తి ఉద్యోగాలలో కృత్రిమ పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మీ వల్ల ప్రయోజనం పొందినవారు మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉండరు. రాజకీయ పదవి లభిస్తుంది. సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. çప్రేమ, పెళ్ళి వ్యవహారాలు చికాకుపరుస్తాయి. అవివాహితులకు వివాహకాలం.

సంతానం లేనివారికి సంతానప్రాప్తి. తెల్లజిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. అలంకార సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతికి నూతన వ్యూహాలను వెతుకుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. గోప్యంగా విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి.

వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. పిల్లలు జీవితంలో స్థిరత్వం సాధించలేదన్న దిగులు తీరుతుంది. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కంప్యూటర్, విద్య, ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది. మీరు చేసే ఇతరత్రా వ్యాపారాలు, వ్యవసాయరంగ ఉత్పత్తులు, బ్యూటీపార్లర్స్, హోటళ్ళు నడపడం మొదలైన వ్యాపారాలు కలిసివస్తాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు, లాభపడతారు.

రాజకీయ పదవి లభిస్తుంది. ప్రేమ వివాహాలు ఫలించవు. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ వంటి వాటికి ఎంపిక అవుతారు. డాక్టర్‌ కావాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వస్త్ర వ్యాపారం, స్టేషనరీ వ్యాపారం, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు. ఫలితాలు నామమాత్రంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు బాగున్నాయి. కీర్తిశేషులైన వారి జ్ఞాపకాలు బాధిస్తాయి. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లకీ‡్ష్మదేవి అనుగ్రహం, లకీ‡్ష్మకటాక్షం కలుగుతుంది. చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారానికి దూరంగా ఉండండి.

ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు పొడిగించబడతాయి. ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వపరమైన సబ్సిడీలు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనువంశికంగా రావలసిన ఆస్తుల విషయంలో మీకు సమన్యాయం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాలలో ప్రత్యేకశ్రద్ధ అవసరం. కీళ్ళనొప్పులు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు జాగ్రత్తగా ఉండాల్సిన కాలం.

గ్రీన్‌కార్డ్‌ కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. రాజకీయ పదవీప్రాప్తి, ప్రజాకర్షణ సంప్రాప్తం. పూజలలో, ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి, ఇది ఎంతో విశిష్ఠమైనది మీ కీర్తిప్రతిష్ఠల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది. బిందుప్రస్థార అష్టమవర్గుననుసరించి పేరు మార్చుకోవాలి. దొంగ స్వామీజీల వల్ల, దొంగ గురువుల వల్ల నష్టపోతారు, జాగ్రత్త వహించండి. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. వివాహాది శుభకార్యాలను సంతృప్తికరంగా నిర్వహించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విధులను సక్రమంగా, నీతిగా, నిజాయితీగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. బదిలీ కోరుకునే వారికి బదిలీ అవుతుంది. క్రీడారంగంలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది.

yearly horoscope 2023

Advertisement
 
Advertisement