19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్‌..ఆమె ఆస్తి అన్ని కోట్లా? | World's Youngest Billionaire Is A 19 Year Old College Student | Sakshi
Sakshi News home page

19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్‌..ఆమె ఆస్తి అన్ని కోట్లా?

Published Fri, Apr 5 2024 1:10 PM | Last Updated on Fri, Apr 5 2024 2:10 PM

World's Youngest Billionaire Is A 19 Year Old College Student - Sakshi

కొందరు అత్యంత చిన్న వయసులోనే కోటీశ్వరులుగా అవతరిస్తారు. తరతరాల నుంచే వచ్చే ఆస్తుల కారణంగా ఒక్కసారిగా చిన్న వయసులోనే ధనవంతులుగా అయిపోతుంటారు. చెప్పాలంటే కోటీశ్వరులు తమ ఆస్తులను వృద్ధి చేస్తూ మనవళ్లు లేదా మనవరాళ్ల పేర్ల మీద రాయడం వల్ల లేదా మరణం కారణంగానో వాళ్ల వారసులు ఇలా ధనవంతులుగా అయిపోతారు. అలానే ఇక్కడొక విద్యార్థి చిన్నవయసులోనే బిలీయనీర్‌గా అవతరించింది.  ఇంతకీ ఎవరంటే ఆమె..?

19 ఏళ్ల బ్రెజిలియన్‌ విద్యార్థి లివియా వోయిగ్ట్‌ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా ఈ ఏడాది ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఆ జాబితాలో 33 ఏళ్ల వయసున్న దాదాపు 25 మంది యువ బిలియనీర్లు ఏకంగా రూ. 11000 కోట్లు సంపదను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఈ లివయా వోయిగ్ట్‌ ఎవరంటే..

ఈ ఏడాది 2024లో ప్రపంచంలోనే అత్యంత చిన్న పిన్నవయస్కురాలిగా టైటిల్‌ని గెలుచుకుంది లివయా వోయిగ్ట్‌. ఇంతకుమునుపు ఆ టైటిల్‌ని అందుకున్న ఎస్సిలర్‌ టుక్సోటికా వారసుడు డెల్‌ వెచియా నుంచి లివయా ఆ టైటిల్‌ని అందుకోవడం విశేషం. ఇక ఈ డెల్‌  వెచియా లివియా కంటే జస్టే రెండు నెలలే పెద్దవాడు. అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ మోటార్‌ల తయారీ కంపెనీ వెగ్‌(WEG)ని ఆమె తాత వెర్నర్‌ రికార్డో వోయిగ్ట్‌, దివగంత బిలియనీర్లు ఎగ్గాన్ జోవో డా సిల్వా, గెరాల్డో వెర్నింగ్‌హాస్‌లతో కలిసి స్థాపించారు.

ఆ కంపెనీలో లివియా అతి పెద్ద వాటాదారు.  ఇక లివియా సంపద నికర విలువ ఏకంగా రూ. 9 వేల కోట్లు. అలాగే ఆమె అక్క డోరా వోగ్ట్ డి అస్సిస్ కూడా ఫోర్బ్స్‌ అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్‌ లిస్ట్‌లో ఒకరిగా ఉన్నారు. ఇక డోరా 2020లో ఆర్కిటెక్చర్‌ డిగ్రీని పూర్తి చేసింది కాగా, లివియా వెగ్‌(WEG) కంపెనీ బహుళ జాతి కంపెనీగా దాదాపు 10కి పైగా దేశాల్లో కర్మాగారాలు ఉన్నాయి. ఆమె కంపెనీ 2022లో సుమారు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే లివియా ప్రస్తుతం బ్రెజిల్‌లోని విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఇంకా ఆమె WEGలో బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో సాగకపోయినా అందులో అతిపెద్ద వాటాదారు కావడంతో బిలియనీర్‌గా అవతరించింది. ఇక ఈ బిలియనీర్‌ ర్యాంకులో చాలామంది యువ వారసులు చేరారు. అందులో ఇద్దరు ఐర్లాండ్‌ మిస్త్రీ సోదరులు కూడా ఉన్నారు. 

(చదవండి: మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement