Varalakshmi Vratham 2023: శ్రావణమాసం అంటేనే పండుగలు, శుభకార్యాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది.
‘వర’అంటే శ్రేష్ఠమైంది అని అర్థం వస్తుంది. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం విశేషాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. మహామాయారూపిణి, శ్రీ పీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టయిశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మీ రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం.
సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు. అది శ్రేష్టం కూడా. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం చేసుకోవచ్చు. అదీ కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు.

వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి?
శ్రావణమాసంలో అత్యంత విశిష్టంగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అన్నది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ విధంగా వివరించారు.
వరలక్ష్మీ వ్రత కథ : కైలాసగిరిలో పరమేశ్వరుడు తన అనుచర గణములతో, మునిశ్రేష్టులతో కూడియుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది.స్వామీ! ప్రీలు సుఖసౌఖ్యాలను, పుత్రపొత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎటువంటి వ్రతాలను, నోములను ఆచరించాలో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అన్నది. పరమేశ్వరుడు సమాధానమిస్తూ 'స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం పూర్తయ్యాక వ్రత కథను వినాలి. వ్రతాన్ని ఆచరించిన వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ కథను తెలియచేస్తాను అని పరమేశ్వరుడు వ్రత కథను వినిపించాడు.

పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణాన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె వేకువఝామునే లేచి స్నానమాచరించి పుష్పాలను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల వలె చూచుకుంటూ ఉందేది. గృహకార్యాలన్నీ స్వయంగా తానే చేసుకొనేది. చుట్టుప్రక్కల వారితో, బంధువులతో చనువుగా కలసిమెలసి ఉందేది. చారుమతి సద్దుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది ఒకనాడు చారుమతి కలలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా అన్నది.
చారుమతీ! నీ సత్ప్రవర్తనకు, సద్ద్గుణాలకు ప్రసన్నురాలిని అయ్యాను. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయి. చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదవికి ప్రదక్షిణాలు చేసి స్తుతించింది. తెల్లవారిన తరువాత భర్త, అత్తమామలకు తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. చుట్టుప్రక్కల గల స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని సంతోషించారు.
అందరూ కలసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించుకున్నారు. అందరూ శ్రావణ శుక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కొరకు వేచి చూడసాగారు. ఆరోజు చారుమతితో సహా ప్రీలందరూ వేకువ రూమననే లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందర గోమయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మంటపాన్ని ఏర్పాటుచేసింది. ఆ మంటపంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసింది. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది.

ఆనాటి నుంచి ఆనవాయితీగా..
శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి
విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ
అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోపచార పూజలు గావించింది. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయసాదులను సమర్పించింది. అనంతరం 'ప్రీలందరూ కలసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లు ఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ళవైపు చూసుకుంటే గజ్జెలు, రెండవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి హస్తాలు నవరత్నఖచిత కంకణాలతో ప్రకాశించసాగాయి. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలంకార భూషణాలతో ప్రకాశించసాగారు.

వారి గృహాలన్నీ సకల సంపదలతో సమృద్ధమయ్యాయి. వ్రతం పరిసమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన 'బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోకోపకారం కొరకు చారుమతి అందరిచేత వరలక్ష్మీ వ్రతాన్ని చేయించిందని పౌరులందరూ ఆమెను ప్రశంసించారు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
