చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకోవాలి? | Sakshi
Sakshi News home page

Ugadi 2024: చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకోవాలి?

Published Tue, Apr 9 2024 7:20 AM

Ugadi 2024:Why Do We Celebrate Ugadi In Chaitra Masam - Sakshi

చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నెలకు ఆ మాసం పేరు వస్తుంది. ఇది అందరికీ తెలిసింది. ఎన్నో పవిత్రమైన నెలలు ఉండగా పనిగట్టుకుని ఈ చైత్రంలోనే ఉగాది పండుగ ఎందుక జరుపుకుంటున్నాం. పైగా ఈ కాలం సూర్యుడి భగభగలతో ఇబ్బంది పడే కాలం కూడా అయినా కూడా ఈ నెలకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు. అదీగాక చైత్రమాసాన్ని విశిష్ట మాసం కూడా చెబుతారు. ఎందుకు అంటే..

నిజాని విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో కాబట్టి అంతకు మించి ఉత్క్రుష్టమైన నెల ఇంకొకటి ఉండదు. అలాగే అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. ''మాసానాం మార్గశీర్షోహం'' అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి, కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. పోనీ చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసం..ఇంతటీ పవిత్రమైన నెలలన్నింటిని పక్కన పెట్టి మరీ చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే..

చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసం వచ్చేటప్పటికీ శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మండగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.

జీవిత సత్యం..
నిశితంగా చూస్తే..ఇది మనిషి జీవితానికి అర్థం వివరించేలా ఉంటుంది. ఎందుకంటే కష్టాలతో కడగండ్ల పాలై డీలా పడి ఉన్నప్పుడూ ఆగిపోకూడదని, సూచనే ఈ వసంతకాలం. ప్రకృతిలో ఆకురాలు కాలం ఉన్నట్లుగానే మనిషి జీవితంలో పాతాళానికి పడిపోయే ఆటుపోట్లు కూడా ఉంటాయని అర్థం. కాలగమనంతో అవి కూడా కొట్టుకుపోయి మనికి మంచి రోజులు అంటే.. వసంతకాలం చెట్లు చిగురించినట్లుగా జీవితం కూడా వికసిస్తుందని, చీకట్లుతోనే ఉండిపోదని చెప్పేందుకు.

చలి అనే సుఖం ఎల్లకాలం ఉడదు, మళ్లీ కష్టం మొదలవుతుంది. ఇది నిరంతర్ర చక్రంలా వస్తునే ఉంటాయి. మనిషి సంయమనంతో భగవంతుడిపై భారం వేసి తాను చేయవలసిని పని చేస్తూ ముందుకు పోవాలన్నదే "కాలం"  చెబుతుంది. "కాలం" చాలా గొప్పది. అదే మనిషిని ఉన్నతస్థాయికి తీసుకొస్తుంది. మళ్లీ అదే సడెన్‌గా అగాథంలోకి పడేసి పరిహసిస్తుంటుంది. అంతేగాదు కాలం ఎప్పుడూ మనిషిని చూసి నవ్వుతూ ఉంటుందట. ఎందుకంటే ఎప్పుడూ మనమీద గెలిచేది తానే (కాలమే) అని. ఎందుకంటే బాధ రాగానే అక్కడితో ఆగిపోతుంది మనిసి గమనం. వాటితో నిమిత్తం లేకుండా పయనం సాగిస్తేనే నువ్వు(మనిషి)అని కాలం పదే పదే చెబుతుంది. కనీసం ఈ ఉగాది రోజైన కాలానికి గెలిచే అవకాశం ఇవ్వొద్దు. కష్టానికే కన్నీళ్లు వచ్చేలా మన గమనం ఉండాలే సాగిపోదాం. సంతోషం సంబంరంగా మన వద్దకు వచ్చేలా చేసుకుందాం..!

(చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?)

Advertisement
Advertisement