
డిగ్రీల మీద డిగ్రీలు చేయడం కాదు. చదువుకి తగ్గ ఉద్యోగం, వేతనం అందుకున్నవాడే అసలైన అదృష్టవంతుడు. అలాంటి లక్ కొందరికే సొంతం. కానీ ఇక్కడొక వ్యక్తి మాత్రం అలాంటి పెద్ద పెద్ద చదువులు చదవకుండానే జస్ట్ రెండు ఉద్యోగాల మారి..ఏకంగా రూ. 26 లక్షల నుంచి రూ. 70 లక్షల వేతనం అందుకుంటున్నాడు. అందుకు సంబంధించిన పోస్ట్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారి రకరకాల చర్చలకు తెరలేపింది.
సౌరబ్ యాదవ్ అనే వ్యక్తి ఎలాంటి ఐఐటీ డిగ్రీలు, ఎంబిఏ డిగ్రీలు పూర్తి చేయలేదు. కేవలం కష్టపడి ఈ భారీ స్థాయిలో జీతాన్ని అందుకుంటున్నాడు. జస్ట్ రెండు ఉద్యోగాలు మారుతూ భారీ స్థాయిలో వేతనం అందుకునే రేంజ్‌కి ఎదిగాడు.
తొలి ఉద్యోగంలో ఏడాదికి రూ. 26 లక్షలు తీసుకోగా, రెండో ఏడాది రూ. 28 లక్షలు, మూడో ఏడాది రూ. 70 లక్షలు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అదంతా కేవలం తన హార్డ్ వర్క్‌తోనే ఈ ఘనతను సాధించాడు. ఈ విషయాన్ని ఒక సాఫ్ట్‌వేర్ టెక్కీ నెట్టింట పోస్ట్ చేయడంతో పెద్ద దుమారం రేపి చర్చలకు దారితీసింది. ఉన్నత చదువులు చదివితే భారీ స్థాయిలో వేతనం ఇస్తారన్న అపోహా ఈ పోస్ట్‌తో తొలిగిపోతుందని కొందరూ.
అతడు పనిచేసే చోట వాతావరణం ఎలా ఉండేది, ఎలా తన పై అధికారులను ఆ స్థాయిలో జీతాలు ఇవ్వమని చర్చించాడు తదతరాల గురించి తెలుసుకోవాలనుంది అంటూ పోస్టులు పెట్టారు. ఈ పోస్ట్ కష్టపడితే అనితర సాధ్యమైనది కూడా సాధించొచ్చు అన్నే విషయాన్ని హైలెట్ చేసింది కదూ..!.
(చదవండి: భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..! రష్యన్ మహిళ పోస్ట్ వైరల్)