సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం | Surgery Free Brain Stimulation Offers New Hope For Dementia Treatment | Sakshi
Sakshi News home page

Dementia Treatment: సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం

Oct 20 2023 5:13 PM | Updated on Oct 20 2023 5:33 PM

Surgery Free Brain Stimulation Offers New Hope For Dementia Treatment - Sakshi

విద్యుత్‌ షాక్‌ని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని శాస్త్రవేత్తలు కొత్తరకం ప్రయోగం చేశారు. హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్స నిర్వహించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు.

తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్‌ ఒకటి. అల్జీమర్స్‌ కారణంగా మానసిక, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిజార్డర్ కారణంగా బ్రెయిన్‌ సెల్స్‌ దెబ్బతింటాయి. కాలక్రమేణా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి.

అల్జీమర్స్ బారినపడినవాళ్ల లో ఈ కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ చిన్నగా అవుతుంది. అంతేకాదు 'హైపోమెటబాలిజం' ఉంటుంది. అంటే గ్లూకోజ్ తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే. కాకుండా జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. హిప్పోకాంపస్‌లోని న్యూరాన్‌లను ఉత్తేజపరిచేందుకు కొత్త హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని రీసెంట్‌గా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. 

ఇంపీరియల్ కాలేజ్ లండన్ (ICL) శాస్త్రవేత్తల నేతృత్వంలో టెంపోరల్ ఇంటర్‌ఫెరెన్స్ (TI) బ్రెయిన్ స్టిమ్యులేషన్‌తో మతిమరుపును పోగొట్టచ్చని కనిపెట్టారు. ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ విద్యుత్‌ కణాలకు బ్రెయిన్‌కు పంపించి జ్ఞాపకశక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుందట. ఇందులో భాగంగా2,000 Hz,2,005 Hz, వద్ద విద్యుత్‌ కణాలను పంపిస్తాయి.

ఇది ఒకరకంగా కరెంట్‌ షాక్‌ లాంటిదే. 5-Hz కరెంట్‌తో అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్‌ సెల్స్‌ యాక్టివేట్‌ అవుతాయి. దీని వల్ల సెల్-పవర్ చేసే మైటోకాండ్రియాను పునరుజ్జీవింపజేస్తాయని, ఇది మతిమరుపును పోగొడుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో వివరించారు.''ఇప్పటివరకు మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే రోగికి ఎలక్ట్రోడ్‌లను శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సి వచ్చేది.

కానీ ఈ హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఎలాంటి నొప్పిలేకుండా రోగికి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేయొచ్చు.'' అని సైంటిస్ట్‌ నిర్‌ గ్రాస్‌మాన్‌ తెలిపారు. ఈ టెక్నిక్‌తో సర్జరీ అవసరం లేకుండా మనిషి మెదడులోని కణాలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్‌ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement