
మహిళల్లో చాలామంది తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసు వారిగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారంటూ ఈ అంశంపై సమాజంలో జోకులూ, సెటైర్లూ ఎక్కువగానే వినిపిస్తుంటాయి. కానీ ఇలా తక్కువ వయసువారిగా కనిపించడం అన్నది ఆరోగ్యపరంగా, ఆత్మవిశ్వాసపరంగా చాలా మేలు చేస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. మహిళలకే కాదు... ఈ విషయం పురుషులకూ వర్తిస్తుంది.
నిజానికి తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసువారిగా కనిపించేవారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం తోపాటు ఆరోగ్యపరంగా వాళ్లకు హైబీపీ, పక్షవాతం, గుండెజబ్బుల వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనల్లో తేలింది.
తామింకా చిన్నవాళ్లమేననే భావన వల్ల వారు సుదీర్ఘకాలం పాటు జీవించడమూ జరుగుతుందని వెల్లడైంది. వాళ్ల ముఖంపైన ముడుతలు రావడమూ తక్కువేనని తేలింది. ‘‘జర్నల్ ఆఫ్ జెరంటాలజీ’’ అనే వైద్య జర్నల్‌లో నమోదైన పరిశోధనల ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి.
(చదవండి: తల్లి పాలతో మెదడు మెరుగ్గా!)
Comments
Please login to add a commentAdd a comment