Solar Oven: వెజ్‌తో పాటు నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ కూడా గ్రిల్‌ చేసుకోవచ్చు.. ధర రూ.48,738

Solar Oven How It Works And Price Details - Sakshi

ఈ రోజుల్లో సోలార్‌ మెషిన్స్‌కి డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఆ తర్వాత ఇంధనం ఖర్చు ఉండదనేది వీటి ప్లస్‌ పాయింట్‌. టెక్నాలజీ పెరిగిన తరుణంలో.. సోలార్‌ కుక్‌ వేర్‌ మార్కెట్‌లోకి పోటెత్తుతోంది. ఇందులో కూరగాయ ముక్కలతో పాటు చికెన్, ఫిష్‌ వంటి నాన్‌వెజ్‌ ఐటమ్స్‌.. బ్రెడ్స్, కేక్స్‌ వంటివెన్నో గ్రిల్‌ చేసుకో వచ్చు, కుక్‌ చేసుకోవచ్చు.

అందుకు వీలుగా ఈ ఓవెన్‌ పెద్ద సైజ్‌ పెట్టెలా ఉంటుంది. దానికి ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్‌ మూతతో పాటు.. మూడువైపులా (చిత్రంలో గమనించొచ్చు) సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతను స్టోర్‌ చేసే సామర్థ్యం కోసం.. టెంపర్డ్‌ డబుల్‌ ప్యాన్డ్‌ గ్లాస్‌ మెటీరియల్‌ అమర్చి ఉంటుంది. థర్మల్‌ హీట్‌ రెసిస్టెంట్‌ లేయర్లు, అధిక నాణ్యత కలిగిన యానోడైజ్డ్‌ అల్యూమినియం రిఫ్లెక్టర్స్‌తో ఇందులోని ఆహారం వేగంగా ఉడుకుతుంది. మొత్తానికి ఈ సోలార్‌ ఓవెన్‌.. నాణ్యత కలిగినది, అనుకూలమైనది, ఉపయోగించడానికి సులభమైనది.

సోలార్‌ ఓవెన్‌ ధర: 639 డాలర్లు (రూ.48,738) 

చదవండి👉🏾 హాట్‌ అండ్‌ కూల్‌ ట్రావెలింగ్‌ రిఫ్రిజిరేటర్‌.. ధర 6 వేలు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top