సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయొద్దా?

Is Skipping Better Than Walking For Weight Loss, Exercise Benefits - Sakshi

సన్నగా ఉంటే వ్యాయామం అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ సన్నగా, పీలగా ఉన్నవాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే డైట్‌తో పాటు వ్యాయామం తప్పదు. సన్నగా ఉన్నవాళ్లు కోచ్‌ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ముఖ్యంగా కార్డియో వర్కవుట్స్‌ కన్నా స్ట్రెంత్‌ ట్రైనింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా సరే బెల్లీ బలంగా మారాలంటే క్రంచెస్‌ చేయాలి. మీ సామర్థ్యాన్ని బట్టి 20 సార్లు 3 సెట్లు లేదా 15 సార్లు 4 సెట్లు రోజూ చేస్తే మంచి ఫలితం తొందరగా కనిపిస్తుంది. 


స్కిప్పింగ్‌ ఇలా చేద్దాం!
పది నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం ఎనిమిది నిమిషాల నడకకు సమానం. స్కిప్పింగ్‌కు మీరు ఎంచుకునే తాడు మీ ఎత్తుకు రెండింతలుండాలి. దానిని మీ పాదాలతో అదిమి పట్టి రెండు అంచులను మీ ఎత్తుకు సమానంగా ఇరువైపులా చూసుకుని మీ చేతులతో ముందుకు, వెనక్కు తిప్పి చూసుకోవాలి. అప్పుడే కాళ్లకు అడ్డం పడకుండా క్రమపద్ధతిలో స్కిప్పింగ్‌ చేయగలరు. ఒకేవిధమైన ఎక్సర్‌సైజ్‌లు కాకుండా కాంపౌడ్‌ ఎక్సర్‌ సైజ్‌ లు అంటే క్వాట్స్, డెడ్‌ లిప్ట్, బెచ్‌ ప్రెస్, మిలటరీ ప్రెస్, డంబెల్‌ రో ప్రయత్నించడం వల్ల కండరాలు పటిష్ఠంగా తయారై, తీరైన ఆకృతిలోకి మారతాయి. మొదటి రోజునుంచే వ్యాయామాలతో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టొద్దు, మోతాదును పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఫిట్‌నెస్‌ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.


వావ్‌.. వాకింగ్‌!
క్రమం తప్పక వాకింగ్‌ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోనులు విడుదలవుతాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రెగ్యులర్‌ వాకింగ్‌తో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ అరగంట వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుంది, నిత్యం 10 వేల స్టెప్స్‌ (100 నిమిషాలు) పాటు వాకింగ్‌ చేస్తే అధిక బరువు ఈజీగా తగ్గుతారు. బూట్లు లేకుండా ఒట్టి పాదాలతో చేసే వాకింగ్‌తో మెంటల్‌ టెన్షన్‌ తగ్గుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని, హృద్రోగాల రిస్కు తగ్గుతుందని, మెన్సస్‌ టైంలో వచ్చే పొత్తికడుపు నొప్పులు నివారించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. 

ఇక్కడ చదవండి:
కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి

నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top