పాదరక్షలు పదిలంగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటించండి..!

Simple Tips To Keep Footwear Sturdy - Sakshi

ఇంటిప్స్‌

కాలమేదైనా పాదరక్షలు ధరించాల్సిందే. రోజూ కురుస్తోన్న వర్షాలకు చెప్పులు, బూట్లకు బురద, మురికి పట్టి దుర్వాసన వస్తుంటాయి. వీటికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రెండోరోజు వేసుకోవడం కూడా కష్టమే. ఈ కింది చిన్నపాటి చిట్కాలు పాటించారంటే మీ పాదరక్షలు భద్రంగా ఉంటాయి. అవేంటో చూద్దాం...

  • వర్షంలో బయటకు వెళ్లివచ్చిన తరువాత తడిసిపోయిన షూస్‌ సరిగా ఆరవు. షూ లోపల ఉన్న తేమ శిలీంధ్రాలు పెరగడానికి దోహద పడుతుంది. దీంతో షూస్‌ త్వరగా పాడవ్వడమేగాక,  దుర్వాసన వస్తుంటుంది. తడిసిన బూట్లను గాలి తగిలే ప్రదేశంలో ఆరబెట్టడంతోపాటు, షూస్‌ లోపల టిష్యూ పేపర్లను ఉంచాలి. టిష్యూ పేపర్‌లు లోపలి తేమను పీల్చి షూ ను పొడిగా మారుస్తాయి.
  • ఒకోసారి ఎంత శుభ్రంగా కడిగినప్పటికీ చెప్పులపైన  పేరుకుపోయిన బురద ఒకపట్టాన వదలదు. ఇలాంటప్పుడు పాత టూత్‌బ్రష్‌కు కొద్దిగా టూత్‌ పేస్టు రాసి పది నిమిషాలపాటు రుద్దితే మురికి అంతా పోతుంది. తరువాత బట్ట లేదా టిష్యూ పేపర్‌తో తుడిచి ఆరబెడితే కొత్తవాటిలా తళతళ మెరుస్తాయి. 
  • పాదరక్షల దుర్వాసన పోవాలంటే షూస్‌లో టీబ్యాగ్స్‌ను పెట్టి రాత్రంతా ఉంచాలి. ఈ బ్యాగ్‌లు లోపలి దుర్వాసనను లాగేస్తాయి.
  • ఈ చిట్కాలు పాటించడం వల్ల చెప్పులు, షూలేగాక మీ పాదాలు కూడా పదిలంగా ఉంటాయి. 
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top