సాక్షి, హైదరాబాద్: ఈ చోరీ చూసి మరీ.. ఇలా ఉన్నారేంట్రా బాబూ.. అంటూ హైదరాబాద్ వాసులు అవాక్కవుతున్నారు. ఎల్‌బీ నగర్‌లోని ఓంకార్ నగర్, శక్తి నగర్‌లలో చెప్పుల దొంగలు చెలరేగిపోతున్నారు. మంగళ వారం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో నాలుగు ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు ఆగంతకులు వేర్వేరుగా ప్రవేశించి చెప్పులను మూటలుగా కట్టుకుని పారిపోయారు.

ఒక ఆగంతకుడు అయితే మహిళలు ధరించే నైటీలు కూడా తీసుకెళ్ళాడు. నిందితులు చారల టీ షర్టులు, మాస్క్ ధరించి ఉన్నారు. నిందితులు మతి స్థిమితం కోల్పోయి ఉన్నారా? లేక భవిష్యత్తులో పెద్ద దోపిడీ జరపడానికి రెక్కీ నిర్వహించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


