Beauty Tips: ఇలా చేశారంటే ముఖం కాంతులీనడం ఖాయం!

Simple And Best Beauty Tips For Glowing Skin Check - Sakshi

చర్మం నిగనిగలాడుతూ ఉండటం కోసం, ముఖం మెరుపులీనడం కోసం రకరకాల క్రీములు, మందులు వాడుతుంటారు చాలామంది. అయితే వాటితోపాటు ఒత్తిడి కూడా లేకుండా చూసుకోవడం అవసరం. ఎందుకంటే ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు శారీరక ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయి.

ఫలితంగా ముఖం పీక్కుపోయినట్లు ఉండటం, జిడ్డు కారుతూ ఉండటం, చెమట ఎక్కువగా పట్టడం, చర్మంపై చిన్న చిన్న దద్దులు, పొక్కులు వంటివి రావడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. ఈ పరిస్థితిలో యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, మానసిక సమస్యలను అదుపులో ఉంచేందుకు కంటినిండా నిద్రపోవడం కూడా ఎంతో మేలు చేస్తుంది. 

ఇంటి చిట్కాలతో
చర్మం మెరుస్తూ ఉండాలంటే చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రెగ్యులర్‌ ఫేషియల్స్, క్లీనప్‌లు చేయాలి. శనగ పిండి, పసుపు, పెరుగు, తేనె వంటి ఇంటి చిట్కాలు  చర్మాన్ని తళతళ మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.

పోషకాల ఆహారం
ఆహారంలో అన్ని రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. శరీరానికి అన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్‌లను పుష్కలంగా అందించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబించాలి. ఆహారంలో కూరగాయలు, పండ్లను సమృద్ధిగా ఉండేలా చూసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

చదవండి: బొప్పాయి గింజలు పొడి చేసుకుని తిన్నారంటే! ఇందులోని కార్పైన్‌, పాలీఫెనాల్స్‌ వల్ల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top