ఇంట్లో ఎవరికైనా ఒకరికి కరోనా పాజిటివ్‌ వస్తే, మిగతా కుటుంబ సభ్యులు కూడా మందులు వాడాలా?

Precautions for Family Members of Corona Patients - Sakshi

వాడాలి. మిగతా కుటుంబసభ్యులు టెస్ట్‌ చేయించుకున్నా, చేయించుకోకపోయినా, టెస్ట్‌ చేయించుకుంటే ఒకవేళ నెగెటివ్‌ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా.. డాక్టర్‌ సూచన మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఇన్ఫెక్షన్‌కు గురైనా లక్షణాలు ఉండకపోవచ్చు. ఇబ్బందిపడకపోవచ్చు.

అలాగే లక్షణాలు బయటపడడానికి సమయం పట్టొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా యాంటీ బయోటిక్స్, ఇతరత్రా మందులు వాడితే సీరియస్‌ కాకుండా బయటపడొచ్చు. కుటుంబంలో ఎందరుంటే అందరూ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షణాలుండి నెగెటివ్‌ ఉన్నా తర్వాత రేపో మాపో పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవానికి లక్షణాలు లేకుండా కరోనా ఉండదు కానీ, చాలామంది వాటిని గుర్తించలేరు.

ఉదాహరణకు కొందరికి తలనొప్పి వస్తుంది. దాన్ని సర్వసాధారణమని అనుకుంటారు. ఎండలో తిరగడం వల్ల, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అని అనుకుంటారు. కానీ ఇలాంటివి కూడా లక్షణాలే. తరచుగా కరోనా టెస్టులు చేయించుకోం కాబట్టి మందులు వాడితే మేలు. ఒకవేళ అది కరోనా కాకుండా ఇతరత్రా టైఫాయిడ్‌ వంటివి ఏమైనా అయినా కూడా ఈ మందులు వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. ఏవైనా యాంటీ బయోటిక్స్‌తో సెట్‌ అవుతాయి. ఏ మందులైనా డాక్టర్ల సూచన మేరకు వాడాలి. 

- డాక్టర్‌ హెఫ్సిబా
ప్రభుత్వ వైద్య అధికారి, హైదరాబాద్‌ 

కరోనా సంబంధిత ప్రశ్నలు
కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

కరోనా సోకకుండా జాగ్రత్తపడటం ఎలా..?

కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?

కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది?

కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top