అతడి అడుగులో ప్రతి అంగుళం ఆయుధమే! | Sakshi
Sakshi News home page

అతడి అడుగులో ప్రతి అంగుళం ఆయుధమే!

Published Fri, Feb 24 2023 1:30 AM

Octopus Traveler 2 is releasing today - Sakshi

రోల్‌–ప్లేయింగ్‌ వీడియో గేమ్‌ ‘ఆక్టోపా త్‌ ట్రావెలర్‌–2’ నేడు విడుదల అవుతోంది. 2018లో వచ్చిన  ‘ఆక్టోపాత్‌ ట్రావెలర్‌’కు సీక్వెల్‌గా వచ్చిన గేమ్‌ ఇది. ఈ ఆటలో ఎనిమిది క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. ‘హికారి’ ఒక యోధుడు...ఏ జర్నీ ఫర్‌ హోమ్‌ ‘అగ్నేయ’ ఒక డాన్సర్‌...ఏ జర్నీ ఫర్‌ స్టార్‌డమ్‌  ‘పా ర్టిటియో’ ఒక వ్యాపా రి...ఏ జర్నీ ఫర్‌ప్రా స్పెరిటీ  ‘బస్వాల్ట్‌’ ఒక విద్యావేత్త....ఏ జర్నీ ఫర్‌ రివెంజ్‌  ‘థ్రోన్‌’ ఒక దొంగ...ఏ జర్నీ ఫర్‌ ఫ్రీడమ్‌ ‘టెమోనస్‌’ ఒక మతగురువు...ఏ జర్నీ ఫర్‌ ట్రూత్‌  ‘వొచెట్‌’  ఒక హంటర్‌...ఏ జర్నీ ఫర్‌ లెజెండ్స్‌ ‘కస్టీ’ ఒక మందుల వ్యాపా రి...ఏ జర్నీ ఫర్‌ మెమోరీస్‌.

ఈ టర్న్‌–బేస్‌డ్‌ బ్యాటిల్‌ గేమ్‌లో ప్రతి ఎనిమీకి కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే సులభంగా కనుక్కునేలా ఉండవు. అవి ఏమిటో తెలుసుకుంటే ఆటలో అడుగులు ముందుకుపడతాయి. ఈ గేమ్‌లో డే టైమ్, నైట్‌ టైమ్‌ అనే రెండు సెగ్మెంట్‌లు ఉంటాయి. డే టైమ్‌లో ఆడే విధానానికి, నైట్‌ టైమ్‌లో ఆడే విధానానికి తేడా ఉంటుంది. డే టైమ్‌లో ఆడాల్సి వస్తే కొత్త స్కిల్స్‌లోప్రా వీణ్యం సంపా దించాల్సి ఉంటుంది.

జానర్‌: రోల్‌ ప్లేయింగ్‌       మోడ్స్‌: సింగిల్‌ ప్లేయర్‌   ప్లాట్‌ఫామ్‌: నిన్‌టెండో స్విచ్, ప్లే స్టేషన్‌ 4, ప్లే స్టేషన్‌ 5, విండోస్‌

Advertisement
 
Advertisement
 
Advertisement