National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష | Sakshi
Sakshi News home page

National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష

Published Sat, Feb 10 2024 4:11 AM

National Deworming Day 2024: Protect your child from worm infections - Sakshi

నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి.
మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త.

నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్‌ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు.  పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి.

నులి పురుగులంటే?
నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌ని ‘అస్కారియాసిస్‌’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్‌ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు.

ఎలా ప్రవేశిస్తాయి?
చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు.

ఏం చేయాలి?
 ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్‌ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది.

రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు.  రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement