ఎక్కువ సంపాదన కోసం రకరకా మార్గాల్లో అన్వేషిస్తుంటాడు మనిషి. అలా కష్టపడగా..కష్టపడగా.. కొన్నేళ్లకు ధనవంతుడవుతాడు. అదికూడా కొందరికే సాధ్యమవుతుంది. అలా ఓ జంతువు కూడా సంపాదించగలదంటే నమ్ముతారా..!. ఇది చిన్నప్పటి నుంచి దాని విభిన్నమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రజాధరణ పొంది డబ్బులు ఆర్జించడం మొదలుపెట్టింది. అలా ప్రంపచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ పిల్లి అంతలా ఎలా సంపాదిస్తుంటే..
ఆ పిల్లి పేరు నాలా. ఇది కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్ క్యాట్. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ ఈ నాలా అనే పిల్లిని జంతు సంరక్షణ కేంద్ర నుంచి దత్తత తీసుకుంది. అప్పుడు దాని వయసు కేవలం ఐదు నెలలే. 2012లో వరిసిరి తన స్నేహితులకు, కుటుంబ సభ్యలతో తన పెంపుడు పిల్లి క్యూట్ ఫోటోలను షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇన్‌స్టాలో దాని పేరుతో ఒక ప్రొఫెల్ క్రియేట్ చేసింది. కొద్ది కాలంలోనే ఈ పిల్లి వేలాది ప్రజలను ఆకర్షించింది.
అలా ఆ పిల్లి ఇన్‌స్టాలో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్న జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ పిల్లి అందమైన తలపాగా, నీలికళ్లతో చూపురులను కట్టిపడేస్తుంది. ఇలా నాలాకు పెరిగిన భారీ ఫాలోయింగే..పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితాలో చేర్చింది. అంతేగాదు ఈ పిల్లి పేరు మీదుగా లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్' అనే ఈబుక్‌ను కూడా కలిగి ఉంది.
అలాగే ఆమె సొంత వెబ్‌సైట్ 'లవ్ నాలా' పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్‌ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ లవ్ నాలా బ్రాండ్ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్‌ల వంటి పెట్టుబడుదారుల నుంచి వందల కోట్లు ఆర్జిస్తోంది. ఈ పిల్లి సంపాదనలో ఎక్కువ భాగం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్స్, ప్రొడక్ట్స్ ప్రకటనలు, బ్రాండ్‌ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తోంది. ఈ పిల్లి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రొఫైల్‌ను కలిగి ఉంది.
అయితే ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో జంతు సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి చేస్తుంది ఆ పిల్లి యజమాని వరిసిరి. కాగా, నాలా తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లి ఒలివియా బెన్సన్. ఈ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడవ అత్యంత సంపన్న పిల్లి దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్‌ఫెల్డ్కు చెందిన చౌపెట్టే. దీనికి రూ. 109 కోట్లు సంపద ఉంది.
(చదవండి: 12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే..!)
Comments
Please login to add a commentAdd a comment