క్వారంటీనా జోషీ.. కోవిడ్‌ అవస్థీ

Most Funny Video In Social media: Class Of 2025 - Sakshi

సోషల్‌ స్టార్‌ 

గుడ్‌ మార్నింగ్‌ క్లాస్‌! నౌ ఐయామ్‌ గోయింగ్‌ టు టేక్‌ యువర్‌ అటెండెన్స్‌ క్వారంటీనా జోషీ.. ప్రెజెంట్‌ మిస్‌ లాక్‌డౌన్‌ సింగ్‌ రాథోడ్‌... జెంట్‌ మిస్‌ కోవిడ్‌ అవస్థీ.. కోవిడ్‌..? బీ అటెన్షన్‌ ఇన్‌ ద క్లాస్‌.. అదర్‌ వైజ్‌  ఐ విల్‌ సెండ్‌ యు బ్యాక్‌ టు చైనా కరోనా పాల్‌ సింగ్‌.. ప్రెజెంట్‌ మిస్‌ సోషల్‌ డిస్టెన్స్‌ సింగ్‌.. ప్రెజెంట్‌ మిస్‌ ఉహాన్‌ భదురియా... ఉహాన్‌..? యూ అండ్‌ కోవిడ్‌ వెరీ నాటీ, గెటవుట్‌ ఆఫ్‌ మై క్లాస్‌ రైట్‌ నౌ! 

దాదాపు ఏడాది క్రితం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిన ‘క్లాస్‌ ఆఫ్‌ 2025’ వీడియో ఇది. ఎంతో క్రియేటివ్‌గా ఆలోచించి, వీడియోలో టీచర్‌ పాత్రను పోషిస్తూ లక్షలమందిని ఆకట్టుకున్నారు స్నేహిల్‌ దీక్షిత్‌ మెహ్రా. ఈ వీడియోతో బాగా పాపులర్‌ అయిన స్నేహిల్‌ హిందీ టీవీ చానల్లో క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా మంచి సందేశంతో కూడిన కామెడీ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. 

మధ్యప్రదేశ్‌లో పెరిగిన స్నేహిల్‌... ఇంజినీరింగ్‌ చదివింది. ఫైనల్‌ ఇయర్‌లో ఉండగానే.. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచి్చంది. కానీ ఆర్థిక మాంద్యంతో కొన్నినెలల్లోనే ఉద్యోగం పోయింది. చిన్నప్పటి నుంచి యాంకర్‌ కావాలని కలలు కనే స్నేహిల్‌.. న్యూస్‌ చానల్‌లో ఇంటర్న్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేసాక, ఇంటర్న్‌షిప్‌ మానేసి, సినిమా రిపోర్టర్‌గా చేస్తూనే టెలివిజన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో ట్రైనీగా చేరింది. పని నేర్చుకుంటూనే, ప్రముఖ షోలలో చురుకుగా పనిచేసేది. దీంతో కొద్దికాలంలోనే స్నేహిల్‌ క్రియేటివ్‌ హెడ్‌గా మారింది. తరువాత వివిధ రకాల టీవీ చానల్స్‌లో ఫ్రీలాన్సింగ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌గా చేసింది. ప్రముఖ ‘దిల్‌ సే దిల్‌ తక్‌’ వంటి అనేక పాపులర్‌ షోలకు క్రియేటివ్‌ హెడ్‌గా చేసింది. 

భేరి క్యూట్‌ ఆంటీ 
క్రియేటివ్‌ హెడ్‌గా దూసుకుపోతున్న స్నేహిల్‌కు..‘అపహరణ’ వెబ్‌సిరీస్‌ స్క్రిప్ట్‌ వచ్చింది. ఈ స్క్రిప్ట్‌ను ఏక్తాకపూర్‌కు వినిపించింది. ఏక్తాకు నచ్చడంతో ‘అపహరణ్‌’కు స్నేహిల్‌ క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేసింది. అంతేగాక ఈ సిరీస్‌లో ‘పండిట్‌గారి భార్య’ అనే చిన్న క్యారెక్టర్‌ను చేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ హిట్‌ అవడంతో..  స్నేహిల్‌కు కామెడీ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తే బావుంటుందన్న ఆలోచన వచి్చంది. వెంటనే బీసీ ఆంటీ(భేరీ క్యూట్‌ ఆంటీ) పేరుమీద యూట్యూబ్‌ చానల్‌ను క్రియేట్‌ చేసి, ఇంకా ఇన్‌స్ట్రాగామ్‌లో చిన్నచిన్న కామెడీ వీడియోలను అప్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టింది. సినిమాలు, వెబ్‌సిరీస్, టీవీ షోలలో వచ్చే ఆంటీ క్యారెక్టర్‌లపై రివ్యూల రూపంలో వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేసేది. స్నేహిల్‌ కామెడీ, సమయస్ఫూర్తి, వీడియోలో ఇచ్చే మెసేజ్‌ నచ్చడంతో..అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగి, బీసీ ఆంటీగా బాగా పాపులర్‌ అయ్యింది. 

క్లాస్‌ ఆఫ్‌ 2025... 
లాక్‌డౌన్‌ సమయంలో ‘క్లాస్‌ ఆఫ్‌ 2025’ కామెడీ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. దీంతో సోషల్‌ మీడియాలో స్నేహిల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దీనిలో ముఖ్యంగా కోవిడ్‌ పేరు మీద పిల్లలకు పేర్లు పెట్టడం అందర్ని బాగా ఆకట్టుకుంది. దీని తరువాత అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చిన ఆంటీ తనని తాను పొగుడుకునే ‘బిట్టు బువా’ అనవసరమైన వార్తలు చదివే యాంకర్‌ ‘ప్రభా’ క్యారెక్టర్లతో బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు కూడా క్రియేటివ్‌ హెడ్‌గా, సంజయ్‌ లీలా బన్సాలీ వంటి వారితో కలిసి పనిచేస్తూనే, మరోపక్క కామెడీ వీడియోల ద్వారా లక్షలమంది వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటోంది స్నేహిల్‌.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top