కోల్డ్‌ కాఫీ కోసం కేఫ్‌ల చుట్టూ తిరగకుండా.. ఈ డివైజ్‌తో ఇంట్లోనే.. ధర ఎంతంటే!

Kitchenware: Cold Drip Coffee Machine How It Works And Price Details - Sakshi

Cold Drip Coffee Machine: కాఫీల్లో కోల్డ్‌ కాఫీనే అదుర్స్‌ అంటుంటారు చాలామంది కాఫీ ప్రియులు. అందుకోసం కేఫ్‌ల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి వారికి ఈ డివైజ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని కాఫీ చక్కటి రంగు, రుచి, సువాసనలను మీ కాఫీ మగ్‌లో ఒలకబోస్తుంది. బోరోసిలికేట్‌ గాజుతో తయారైన ఈ డివైజ్‌.. 600 ఎమ్‌ఎల్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

దీనిలోని ఫిల్టర్, లిడ్‌(మూత) వంటివి తుప్పు పట్టకుండా అధిక నాణ్యత గల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందాయి. డివైజ్‌ని ఆన్‌ చేసినప్పుడు.. పైభాగంలో ఐస్‌ ముక్కలు వేసుకుంటే.. ఒక్కో చుక్కా కింద ఉన్న కాఫీ పౌడర్‌లో పడుతూ కింద మగ్‌లోకి కోల్డ్‌ కాఫీ వచ్చి చేరుతుంది. అయితే ఐస్‌ ముక్కల నుంచి వచ్చే వాటర్‌ వేగాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

దీనిలోని డబుల్‌ లేయర్‌ ఫిల్టర్‌.. ఎటువంటి అవశేషాలను వదలకుండా పూర్తిగా ఫిల్టర్‌ చేయగలుగుతుంది. హ్యాండ్‌ బ్రూ కాఫీ కోసం.. కింద ఉన్న మగ్‌ను షేరింగ్‌ పాట్‌గా కూడా ఉపయోగించవచ్చు. అలాగే దీనిలో వేడి వేడి టీ కూడా పెట్టుకోవచ్చు. ఈ డివైజ్‌లోని మగ్‌ సైజ్‌ రిఫ్రిజిరేటర్‌కు అనుకూలంగా ఉంటుంది. దాంతో కోల్డ్‌ కాఫీని నిలవ ఉంచుకోవడం కూడా సులభమే.
ధర -77 డాలర్లు (రూ.5,949 ) 

చదవండి👉🏾All In One Cooker: చికెన్‌, మటన్‌.. పాస్తా, కేక్‌.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే! ధర ఎంతంటే!
చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top