ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే! | Sakshi
Sakshi News home page

Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే!

Published Wed, May 18 2022 2:18 PM

Ice Cream Maker: How It Works And Price Details - Sakshi

చల్లగా, తియ్యగా, కమ్మగా.. రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ఐస్క్రీమ్‌ అంటే చప్పరించని వారెవరు? మరి అలాంటి ఐస్క్రీమ్‌ని మళ్లీమళ్లీ లాగించాలంటే ఇలాంటి మెషిన్‌ ఇంట్లో ఉండాల్సిందే. ఇందులో చాలా రకాల ఐస్క్రీమ్స్‌ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలతో కూడా ఐస్క్రీమ్‌ తయారు చేసుకోవచ్చు.

తగినన్ని పాలు, పంచదార, ఎసెన్స్‌ను జోడించి ఎన్నో రుచులను ఆస్వాదించొచ్చు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందిన.. 2 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ డివైజ్‌ బౌల్‌ని ఫ్రిజ్‌లోనే ఉంచాలి. ఐస్‌క్రీమ్‌ తయారు  చేసుకునే ముందు ఫ్రిజ్‌లోంచి తీసి, డివైజ్‌లో సెట్‌చేస్తే సరిపోతుంది.

దానిపైన మూత, దానిపైనే పవర్‌ యూనిట్‌ అడ్జస్టబుల్‌గా ఉంటాయి. ఆన్, ఆఫ్‌ బటన్‌తోపాటు పవర్‌ బటన్‌ కూడా డివైజ్‌ పైనే కనిపిస్తూ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా ఈజీ. ఈ డివైజ్‌తో పాటు రెసిపీ బుక్‌ కూడా లభిస్తుంది. 

ధర : 40 డాలర్లు (రూ.3,063)

చదవండి👉🏾Milk Warmer: బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్‌.. ధర ఎంతంటే!
చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్‌ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990

Advertisement
 
Advertisement
 
Advertisement