మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. | Kerala Vlogger Said I faced Insults For My Looks But Never Gave Up | Sakshi
Sakshi News home page

మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..

Published Sat, Jun 8 2024 2:00 PM | Last Updated on Sat, Jun 8 2024 2:24 PM

Kerala Vlogger Said I faced Insults For My Looks But Never Gave Up

మనల్ని ఎవరైన కామెంట్‌ చేస్తేనే దిగులు పడిపోతాం. మనం బాగానే ఉన్నా.. ఏదో ఒక విధంగా కామెంట్‌ చేస్తారనే విషయం తెలిసిందే. అలాంటిది అస్సలు రూపమే చూసేందుకు అసహ్యంగా ఉంటే.. అస్సలు బయటకు అడుపెట్టం. కానీ ఈ అమ్మాయి ఆ బాధను దిగమింగడం కాదు..సానుకూలంగా ఆ వైకల్యాన్ని అంగీకరించింది. ఆ అవహేళనలను అధిగమంచి తానెంటో ప్రపంచానికి తెలియజేడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. జన్మతః లేదా మరేదైన కారణం వల్ల వచ్చే వైకల్యం లేదా అనారోగ్యంతో చతికిలపడిపోకూడదని చాటి చెప్పింది. సత్తువ, స్థైర్యం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రూవ్‌ చేసింది. ఎవరంటే ఆమె..

కేరళలోని తిరువనంతపురంకి చెందిన 24 ఏళ్ల బిస్మిత. చిన్నప్పటి నుంచి ఎన్నో హేళనలు, చిత్కారాలు. ఎందుకంటే..? బిస్మిత అరుదైన జన్యుపరమైన చర్మ పరిస్థితి కారణంగా శరీరం అంతా మచ్చల మచ్చలుగా ఉంటుంది. ఇలా బిస్మతకు పుట్టిన రెండు నెలలకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆమె తల్లి మజిత(47)కు కూడా ఇలానే ఉండటంతో..అదే ఆమెకు వంశపారపర్యంగా వచ్చేసింది. కేరళలోని ఆసుపత్రులన్నీ తిరిగింది ఆమె తల్లి. జన్యుపరంగా వచ్చే చర్మ సమస్య, చికిత్స లేదని వైద్యులు చేతులెత్తేయడంతో.. కూతురి జీవితం ఏమైపోతుందోనని ఆందోళనకు గురైంది మజిత. 

చెప్పాలంటే ఇది ఒక​ విధమైన బొల్లి వ్యాధి మాదిరిగా బిస్మిత చర్మం ఉంటుంది. ఎన్ని అవమానాలు​ ఎదురైనా.. చదువును మాత్రం వదల లేదు. అలా ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసింది. అయితే బిస్మిత చిన్నప్పుడు స్కూల్లో  జరిగే పాటల పోటీల్లో  ఎప్పుడూ ఆమెనే విజేత. అందరూ ఆమె గొంతు బాగుంటుందని ప్రశంసించేవారు. దీంతో తానే సొంతంగా వీడియోలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది బిస్మితకి. అందుకు అమ్మ కూడా ఒప్పుకోవడంతో 2019లో టిక్‌టాక్‌ వీడియోలు చేయడం ప్రారంభించింది. అయితే వాటికి ప్రశంసలు కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చేవని బాధగా చెబుతోంది బిస్మిత. 

అస్సలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా..నువ్వు దెయ్యానివా లేక మచ్చల జింకవా.. అంటూ కామెంట్లు పెట్టేవారు. ఇది జన్యుపరమైన సమస్య కదా!..దీన్నే ఇంతలా పట్టించుకుంటున్నారేంటీ అని బాధగా ఉండేది బిస్మతకి. అయినా సరే వీడియోలు తీయడం ఆపలేదు. అనుకోకుండా టిక్‌టాక్‌ని మనదేశంలో బ్యాన్‌ చేయడంతో ఇన్‌స్టాలో రీల్స్‌ పోస్ట్‌ చేసేది. వాటిని కూడా అసభ్య పదజాలంతో ట్రోలింగ్ ‌చేసేవారు. అయినా సరే వెనకడుగు వేయడకుదని గట్టిగా నిశ్చయించుకుంది బిస్మిత. అయితే ఇన్‌స్టాలో బిస్మిత వీడియో చూసి.. ఓ ఫొటోగ్రాఫర్‌ మేకోవర్‌ పేరుతో ఫొటో షూట్‌ చేస్తానని అడిగాడు. ఆ షూట్‌లో నవ వధువులా బిస్మిత మేకప్‌తో ఉంటుంది. 

అందమైన వధువుగా బిస్మిత మారిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసినప్పుడు ఒక్క రోజులోనే లక్షల వ్యూస్‌ వచ్చాయి. దీంతో ‘బిస్మి వ్లాగ్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది బిస్మిత.  మచ్చలున్న అమ్మాయిని పెళ్లాడటానికి ఎవరు ముందుకొస్తారని బంధువులంతా అన్నారు. కానీ ఆటో డ్రైవర్‌ సాను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఆయన సపోర్ట్‌ ఎంతో ఉందంటోంది బిస్మిత. ఈ రీల్స్‌లో తనలాంటి వాళ్లు ఎదుర్కొనే సమస్యలను, రోజువారీ విషయాలను షేర్‌ చేస్తుంది బిస్మిత. ఆ దంపతులకు ఒక కొడుకు కూడా. అయితే అతడికి కూడా ఇలాంటి జన్యు సమస్యే వచ్చింది. తన కొడుకు అయినా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆమె భర్త ఎన్నో ఆస్పత్రులు తిప్పాడు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. 

దీంతో ప్రస్తుతం బాబుకి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతోంది బిస్మిత. ఈ విషయాన్నే వీడియోలో చూపిస్తుంటే..దీనికి కూడా ఆమెను విమర్శించడం బాధకరం. కొడుకు అలా ఉన్నా కూడా.. వీడియోలు చేస్తున్నావు..నీ బతుకు ఇంతేనా అని తిడుతూ కామెంట్లు పెడుతున్నారని బాధగా చెప్పింది బిస్మిత. అయితే తాను వాటిని పట్టించుకోను ఇంకా అలాంటివే చేస్తాను..నా కొడుకికి ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పేందుకైనా ఆపాను అని స్టైర్యంగా చెబుతోంది బిస్మిత.

నిజంగా బిస్మిత చాలా గ్రేట్‌ కదూ..! జస్ట్‌ ఎవ్వరైనా చిన్నగా.. ఏదైనా అన్నా.. తట్టుకోలేం, ఈజీగా తీసుకోలేం. అలాంటిది ఆమె తన రూపం అలా ఉన్నా ధైర్యంగా కెమెరా ముందుకు రావడమే గాక తనలాంటి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. నిజంగా బిస్మిత తనలాంటి వాళ్లకే కాదు..ట్రోలింగ్‌కి  గురయ్యి బాధపడుతున్నవారికి కూడా ఈమె స్ఫూర్తి.

(చదవండి: ఫిడే చెస్‌ రేటింగ్‌ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్‌ జియానా గర్గ్‌..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement