Sakshi News home page

ఓస్టెర్ మష్రూమ్‌ ఎపుడైనా తిన్నారా? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Published Sat, Jan 27 2024 2:25 PM

Impressive Benefits ofImpressive Benefits of Oyster Mushrooms - Sakshi

పుట్టగొడుగులు చాలా రకాలున్నాయి. ఒక్కో పుట్టగొడుగు ఒక్కో రుచి, ఆకృతిలో ఉంటాయి. అయతే బటన్‌ మష్రూమ్స్‌తో ఓస్టెర్ మష్రూమ్‌ ఎక్కువ రుచిగా ఉంటాయివీటిల్లోని గ్లుటామిక్ యాసిడ్  భిన్నమైన రుచిని అందిస్తుంది.   సాధారణ బటన్ పుట్టగొడుగుల కంటే ఓస్టెర్ పుట్ట గొడుగుల్లో దాదాపు రెండు రెట్లు ఎక్కువ గ్లుటామిక్ యాసిడ్‌ ఉంటుంది. 

పుట్ట గొడుగులు  శాకాహారమే అయినప్పటికీ  ఖనిజాలు,ఫైబర్, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నాన్‌వేజ్‌  తినని వారికి  విటమిన్లు పూర్తిగా అందడంతోపాటు, సెలీనియంతో  పాటు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్‌ , ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా ఓస్టెర్ పుట్టగొడుగులు గ్లూటెన్-ఫ్రీ డైట్‌కు అద్భుతం పని చేస్తాయని,  తక్కువ కేలరీలు,  ఎక్కువ పోషకాలతో బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి.  

యాంటీవైరల్, ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటీఆక్సిడెంట్,యాంటీ హైపర్ కొలెస్టెరోలేమియా, యాంటీ-డయాబెటిక్ గుణాలున్నాయని చాలా మంది నిపుణులు నమ్ముతారు.  రుచితో పాటు పోషకాలు మెండుగా ఉన్న ఓస్టెర్  పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు మరికొన్నింటిని చూద్దాం. 

ఓస్టెర్   పుట్టగొడుగులు: లాభాలు
♦ ఆస్టియోపోరోసిస్ , ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది
♦ విటమిన్ డి  లెవల్స్‌ పెరగాలంటేపుట్టగొడుగులు  తినాలి.
♦ సుగర్‌, బీపీ,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
♦ రక్తహీనతనుంచి కాపాడుతుంది. 
♦ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి 
♦ పుట్టగొడుగులను తింటే ఎముకలు దృఢంగా  మారతాయి.
♦ కేన్సర్‌ఉంచి రక్షిస్తుంది. 
♦  తక్కువ కేలరీలు   పుట్టగొడుగులు  బరువు తగ్గడానికి  కూడా సహాయపడతాయి
♦ నరాల ఆరోగ్యానికి మంచిది:
♦  మానసిక ఆరోగ్యాన్ని కాపాడే డోపమైన్ , సెరోటోనిన్‌ను పుట్టగొడుగులలోని కాపర్‌ కంటెంట్ మనకు అందిస్తుంది.
♦ ఈ పుట్టగొడుగుల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఇందులోని B గ్రూప్ విటమిన్, నిద్ర, జ్ఞాపకశక్తికి  చాలా మంచిది.

నోట్‌: పుట్టగొడుగులను తినేముందు అవి మంచివా? కాదా? అని పరిశీలించుకోవాలి. అలాగే పుట్టగొడుగు  నాణ్యతను కూడా తప్పకుండా  తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదం.

Advertisement

తప్పక చదవండి

Advertisement