breaking news
Health and Glow
-
Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!
పుట్టగొడుగులు చాలా రకాలున్నాయి. ఒక్కో పుట్టగొడుగు ఒక్కో రుచి, ఆకృతిలో ఉంటాయి. అయతే బటన్ మష్రూమ్స్‌తో ఓస్టెర్ మష్రూమ్ ఎక్కువ రుచిగా ఉంటాయివీటిల్లోని గ్లుటామిక్ యాసిడ్ భిన్నమైన రుచిని అందిస్తుంది. సాధారణ బటన్ పుట్టగొడుగుల కంటే ఓస్టెర్ పుట్ట గొడుగుల్లో దాదాపు రెండు రెట్లు ఎక్కువ గ్లుటామిక్ యాసిడ్ ఉంటుంది. పుట్ట గొడుగులు శాకాహారమే అయినప్పటికీ ఖనిజాలు,ఫైబర్, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నాన్‌వేజ్ తినని వారికి విటమిన్లు పూర్తిగా అందడంతోపాటు, సెలీనియంతో పాటు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్ , ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా ఓస్టెర్ పుట్టగొడుగులు గ్లూటెన్-ఫ్రీ డైట్‌కు అద్భుతం పని చేస్తాయని, తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. యాంటీవైరల్, ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటీఆక్సిడెంట్,యాంటీ హైపర్ కొలెస్టెరోలేమియా, యాంటీ-డయాబెటిక్ గుణాలున్నాయని చాలా మంది నిపుణులు నమ్ముతారు. రుచితో పాటు పోషకాలు మెండుగా ఉన్న ఓస్టెర్ పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు మరికొన్నింటిని చూద్దాం. ఓస్టెర్ పుట్టగొడుగులు: లాభాలు ♦ ఆస్టియోపోరోసిస్ , ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది ♦ విటమిన్ డి లెవల్స్ పెరగాలంటేపుట్టగొడుగులు తినాలి. ♦ సుగర్, బీపీ,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ♦ రక్తహీనతనుంచి కాపాడుతుంది. ♦ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ♦ పుట్టగొడుగులను తింటే ఎముకలు దృఢంగా మారతాయి. ♦ కేన్సర్ఉంచి రక్షిస్తుంది. ♦ తక్కువ కేలరీలు పుట్టగొడుగులు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి ♦ నరాల ఆరోగ్యానికి మంచిది: ♦ మానసిక ఆరోగ్యాన్ని కాపాడే డోపమైన్ , సెరోటోనిన్‌ను పుట్టగొడుగులలోని కాపర్ కంటెంట్ మనకు అందిస్తుంది. ♦ ఈ పుట్టగొడుగుల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఇందులోని B గ్రూప్ విటమిన్, నిద్ర, జ్ఞాపకశక్తికి చాలా మంచిది. నోట్: పుట్టగొడుగులను తినేముందు అవి మంచివా? కాదా? అని పరిశీలించుకోవాలి. అలాగే పుట్టగొడుగు నాణ్యతను కూడా తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదం. -
Onion skin: ఉల్లిపాయ పొట్టుతో ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
సాధారణంగా వంటల్లో ఉల్లిపాయలను అందరమూ వాడుతుంటాం. కొంతమంది వాసన పడక, మరికొంతమంది ఉపవాసాల సమయంలోనూ ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. అయితే ఉల్లిపాయలు మాత్రమేకాదు ఉల్లిపాయ తొక్కలు లేదా పొట్టు వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు ఉల్లిపాయ తొక్కల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో యాంటీ బయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండి వీటిని తినడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతాయి. వీటిలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువగా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి. క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను ఉల్లిపాయ తొక్కల్లో ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఉల్లి తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేకూరుస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి. అంతేకాదు ఉల్లి పొట్టు మంచి కంపోస్ట్‌గా ఉపయోపడుతుంది. టీ, హెయిర్ డై, టోనర్‌గా, ఫ్లేవర్ ఏజెంట్‌గా, కంపోస్ట్‌గా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు టీ ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందట వీటిని నీటిలో 10 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టి వడపోసి తరువాత ఈ టీని తాగొచ్చు. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మసాలా ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా శుభ్రంగా కడిగి రెండు సార్లు కడగాలి. వీటిని ఎండలో ఆరబెట్టి పొడిచేయాలి. ఆరునెలలపాటు నిల్వ ఉండే ఈ పొడి మసాలాలో కలుపుకుని కూరల్లో వేసుకుంటే..కూర మంచి రుచిగా ఉంటుంది. రుచి, సువాసన స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ తొక్కలను జోడించడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు. చర్మం రోగాలకు ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. హెయిర్ డై సల్ఫర్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగు మార్చుకోవచ్చు. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా బూడిద జుట్టును బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. అలాగే, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలింత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా నూరాలి. దీనికి కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలపాలి. ఇలా చేసుకున్న జెల్‌ను నేరుగా హెయిర్ డైలా అప్లై చేసి గ్రే హెయిర్‌ను కవర్ చేసుకోవచ్చు. మంచి నిద్రకు ఉల్లిపాయ తొక్కలలో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. హెయిర్ టోనర్ పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి. మంచి కంపోస్ట్‌గా మిద్దె తోటల్లో, బాల్కనీ గార్డెన్ ఉల్లి తొక్కల కంపోస్ట్ బాగా ఉపయోపడుతుంది. మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. గులాబీ, మల్లి లాంటి ఇతర పూల మొక్కలకు ఈ కంపోస్ట్ మంచి టానిక్‌లా ఉపయోపడుతుంది. ఉల్లిపాయ తొక్కల్లో మొక్కలకు బలాన్నిచ్చే ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. సహజరంగుగా ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆ రంగును సహజ రంగులుగా వాడతారు. ఉల్లి రకాన్ని బట్టి బంగారు-పసుపు , డార్క్ ఆరెంజ్ రంగు వస్తుంది. హస్తకళాకారులు, చేతివృత్తులవారు ఈ సహజ రంగును వివిధ ఫాబ్రిక్ ,పేపర్ కోసం ఉపయోగిస్తారు. జాగ్రత్త: ఉల్లిపాయ తొక్కను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తులలో అలెర్జీ రావచ్చు. అలాగే కొన్ని రకాల ఉల్లిపాయలపై అప్పుడప్పుడు నల్లటి ఫంగస్ లాంటిది ఉంటుంది. సో శుభ్రమైన హెల్దీగా ఉన్నవాటిని తీసుకొని, నీటిలో బాగా కడిగి వాడుకోవడం ఉత్తమం -
‘ఫోరమ్ మాల్’లో కరిష్మా సందడి
హెల్త్ అండ్ గ్లో పోటీల విజేతలతో ముచ్చటించిన బాలీవుడ్ భామ సాక్షి, బెంగళూరు : తన గ్లామర్‌తో బాలీవుడ్ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన భామ కరిష్మా కపూర్. వివాహం అనంతరం ఆమె సినిమాలకు కాస్తంత దూరంగానే ఉన్న సినీ అభిమానుల్లో కరిష్మాకపూర్కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అలాంటి అందాల తార కరిష్మా కపూర్ నగరంలోని ఫోరమ్మాల్లో బుధవారం సందడి చేశారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ హెల్త్ అండ్ గ్లో సంస్థ నిర్వహించిన ‘హెల్త్ అండ్ గ్లో’ పోటీల్లో విజేతలైన యువతులతో ముచ్చటించేందుకు కరిష్మా కపూర్ నగరానికి వచ్చారు. హెల్త్ అండ్ గ్లో పోటీల్లో విజేతలుగా నిలిచిన పది మంది అమ్మాయిలను ఆమె స్వయంగా అభినందించారు. విజేతలైన వారిలో నగరానికి చెందిన షీతల్, రేవతి, పుష్ప, శ్వేత, గీతాప్రియ, జయంతి, నళినిలతో పాటు హైదరాబాద్‌కు చెందిన మౌనికా వర్థన్, ముంబైకి చెందిన నీతా మాలిక్, చెన్నైకి చెందిన రమ్య సుందరరాజ్‌లు ఉన్నారు. విజేతలుగా నిలిచిన యువతులతో కరిష్మాకపూర్ పిచ్చాపాటి ముచ్చటించారు. అనంతరం కరిష్మా కపూర్ మాట్లాడుతూ... ఇంతకాలం తనపై ఆదరాభిమానాలను చూపిస్తూ వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.