అత్తారింట్లో అల్లుడి స‌ర‌దా ప‌ని.. వీడియో వైర‌ల్‌ | Husband arrives to pick up wife with hilarious cake goes viral | Sakshi
Sakshi News home page

పుట్టింటికి భార్య‌.. భర్త‌గారి ఫ‌న్నీ రిక్వెస్టు

Jun 12 2026 6:31 PM | Updated on Jun 12 2026 6:52 PM

Husband arrives to pick up wife with hilarious cake goes viral

పుట్టింటికి వెళ్లిన భార్య‌ను తీసుకొచ్చేందుకు ఓ భ‌ర్త చేసిన వినూత్న‌ ప్ర‌య‌త్నం న‌వ్వులు పూయించింది. అత్తారింటికి వెళ్లి త‌న ఇల్లాలిని తీసుకురావడానికి అల్లుడు చేసిన‌ సరదా ప‌ని అందరి దృష్టిని ఆకర్షించింది. నా భార్య‌ను నాతో తిరిగి పంపండి అంటూ రాసిన కేక్ తీసుకెళ్లి అత్తామామ‌ల‌ను బ‌తిమాలుకున్నాడు. ఇంత‌గా అడిగితే ఎవ‌రైనా కాదంటారా? వెంట‌నే అత్త‌మామ‌లు.. అల్లుడికి త‌న కూతురిని అప్ప‌గించేశారు. ఈ స‌ర‌దా వీడియో సోష‌ల్ మీడియాలో వెగ వైర‌ల్ అవుతోంది.

‘కరణ్ & మోనా’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. “నువ్వు లేకుండా ఉండలేని వ్యక్తినే పెళ్లి చేసుకో” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు 16 ల‌క్ష‌ల లైకులు, 8 వేల‌కు పైగా కామెంట్లు వచ్చాయి. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. తన భార్య 10 రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లో ఉండటంతో ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన భర్త చేతిలో ఒక ప్రత్యేకమైన కేక్ కనిపించింది. ఆ కేక్‌పై ముజే మేరీ బీవీ వాప‌స్ దొ (నా భార్యను తిరిగి నా ద‌గ్గ‌ర‌కు పంపించండి) అని రాసి ఉండటం చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అత్త‌గారు స్వ‌యంగా కూతురిని అల్లుడికి అప్ప‌గించ‌డం వీడియోలో క‌నిపించింది. వీరు ఎక్క‌డి వారు అనే వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. భార్య‌భ‌ర్త‌ల పేర్లు క‌ర‌ణ్, మోనా అని తెలుస్తోంది.

నెటిజ‌న్ల స్పంద‌న‌
పుట్టింటికి వెళ్లిన భార్య‌ను తిరిగి తీసుకొచ్చేందుకు వినూత్న పంథా అనుస‌రించిన స‌ద‌రు భ‌ర్త‌పై నెటిజ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇల్లాలిపై ప్రేమాభిమానాలు చూపించిన ఇంటాయ‌న‌ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.  “వివాహ జీవితాన్ని సంతోషంగా లేదా బాధాకరంగా మార్చేది చాలా వరకు భర్త ప్రవర్తనే. అతని చిన్న చిన్న ప్రయత్నాలు భార్య హృదయంలో ఎంతో ఆనందాన్ని నింపుతాయి” అని ఒకరు వ్యాఖ్యానించారు.

“ఇది చాలా మధురమైన క్షణం. ముఖ్యంగా అమ్మ గారి స్పందన ఎంతో క్యూట్‌గా ఉంది”, “మీ ఇద్దరికీ ఆశీర్వాదాలు. తన భావాలను ఇంత అందంగా వ్యక్తపరిచే భర్త చాలా అరుదు”, “కూతురిని ప్రేమగా, గౌరవంగా చూసుకునే ఇలాంటి అల్లుడిని ప్రతి తల్లిదండ్రులు స్వాగతించాలి”, “ఇలాంటి అల్లుడు దొరికినందుకు మీ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది” అని నెటిజ‌నులు కామెంట్లు పెట్టారు.

చ‌ద‌వండి: బొంగరపు ఆట కదరా జీవితం!

భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, చిన్న చిన్న మధురమైన ప్రయత్నాలు ఎంతటి ఆనందాన్ని తీసుకురాగలవో ఈ వీడియో మరోసారి గుర్తు చేసిందని నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement