బీట్‌రూట్‌ని మజ్జిగతో కలిపి తీసుకోవచ్చా..? | Health Tips: Why You Should Pair Beetroot With Buttermilk | Sakshi
Sakshi News home page

బీట్‌రూట్‌ని మజ్జిగతో కలిపి ఎందుకు తీసుకోవాలంటే..!

Mar 11 2025 4:58 PM | Updated on Mar 11 2025 5:16 PM

Health Tips: Why You Should Pair Beetroot With Buttermilk

మాములుగా బీట్‌రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దీన్ని జ్యూస్‌ రూపంలో లేదా కూర రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నింటిని కొన్ని రకాల ఆహారాలతో జత చేసి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.

  • బీట్‌రూట్‌ ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. దీన్ని మజ్జిగతో జత చేసి తీసుకుంటే శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ శోషణ పెరుగుతుందని చెబుతున్నారు న్యూట్రిషన్లు. ఇలా తీసుకుంటే ఐరన్‌ శోషణ తోపాటు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. చలవ చేయడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. 

  • బీట్‌రూట్‌లో ఉండే కొన్ని రకాల ఐరన్‌లను మన శరీరం గ్రహించలేదు. అదే దాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే.. అందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి ప్రోబయోటిక్‌లను అందిస్తుంది. మంచి గట్‌ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేగాదు ఇందులోని ఆమ్లత్వం పేగులోని ఐరన్‌ శోషణను మరింత పెంచుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. 

  • దీనిలో నైట్రిక్‌ ఆక్సైడ్‌లుగా మార్చే నైట్రేట్లు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఇది హృదయనాళ పనితీరుకి మద్దతిచ్చే బయోయాక్టివ్‌ పెప్టైడ్‌లను అందిస్తుంది. 

  • వీటన్నింటి తోపాటు కాలేయ పనితీరుకి కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్‌లను తొలగిస్తుంది. ఇలా బీట్‌రూట్‌ బట్టర్‌మిల్క్‌ మిక్సింగ్‌ అనేది శక్తిమంతమైన రిఫ్రెష్‌ టానిక్‌లా పనిచేస్తుంది. 

(చదవండి: 'ఎగ్‌ ఫ్రీజింగ్‌' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్‌ , తానీషా ముఖర్జీ అంతా..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement