Fabric Jewellery: డ్రెస్‌ కలర్‌లో ఉండే ఫ్యాబ్రిక్‌ జ్యువెల్లరీ.. ఇప్పుడిదే ట్రెండ్‌! ధర తక్కువే!

Fashion Trends: Dress Matching Fabric Jewellery And Other Accessories - Sakshi

మ్యాచింగ్‌ ఆభరణం

ఆభరణం అంటే..మనకు బంగారం, వెండి ఇతర లోహాలతో చేసిన నగలే కళ్ల ముందు నిలుస్తాయి. అలా కాకుండా డ్రెస్‌ కలర్‌లో ఉండే ఫ్యాబ్రిక్‌ జ్యువెల్లరీ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. డ్రెస్‌ ఫ్యాబ్రిక్‌నే జ్యువెల్రీ మేకింగ్‌లోనూ వాడుతూ ఆభరణాలను రూపొందించుకోవడంపై దృష్టి పెడుతోంది నేటి తరం. 

డ్రెస్‌ను పోలినట్టుగా ఉండే చెప్పులు, హ్యాండ్‌ బ్యాగ్‌ ఎంపిక మనకు తెలిసిందే. అలాగే, డ్రెస్‌లోని మెటీరియల్‌తోనే ఆభరణమూ ధరిస్తే... ఆ అందం ఇనుమడిస్తుందని నేటి వనితల ఆలోచన.

అందుకే ఇలా ఫ్యాబ్రిక్‌తో రకరకాల ఆభరణాలు తయారు చేయడమే కాదు, వాటి ఎంపిక లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఒకేరంగులో చిన్న చిన్న మార్పులతో ఉండే ఈ ఆభరణాలు క్యాజువల్‌ వేర్‌గానూ, ఫ్యాషన్‌వేర్‌గానూ అందుబాటులో ఉంది. 

జరీ జిలుగులూ ఎంబ్రాయిడరీ మెరుగులు
ఫ్యాబ్రిక్‌ దుస్తులపై ఎంబ్రాయిడరీ సొగసు గురించి మనకు తెలిసిందే. పట్టుచీరల అంచుల అందమూ పరిచయమే. ఎంబ్రాయిడరీ డ్రెస్‌ లేదా జరీ చీర పాతదైపోయిందని పక్కన పెట్టేసేవారు వాటి అంచులను జాగ్రత్తగా కట్‌ చేసి, ముచ్చటైన ఆభరణాలను రూపొందించుకోవచ్చు.

వీటి తయారీలో కావల్సింది నచ్చిన క్లాత్, గట్టి ఫ్యాబ్రిక్, గమ్‌ లేదా సూదీ దారం, ఇయర్‌ హుక్స్‌... సెట్‌ చేసుకుంటే చాలు. కావల్సిన డిజైన్‌లో ఆభరణాలను రూపొందించుకొని డ్రెస్‌కు తగిన  విధంగా ధరించవచ్చు. 

మేడ్‌ ఈజీ...
వందల రూపాయల్లో అందరికీ అందుబాటులో ఉండే ధరలలో ఆకట్టుకునే ఈ ఆభరణాలు అన్ని వయసువారికీ ముఖ్యంగా కాటన్‌ డ్రెస్సులు, చీరల మీదకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

వెస్ట్రన్‌ వేర్‌ మీదకూ వినూత్నంగా వెలిగిపోతున్న ఫ్యాబ్రిక్‌ జ్యువెలరీ మేకింగ్‌ కూడా సులువుగానే ఉండటంతో నేటి వనిత విభిన్న రకాల డిజైన్స్‌లో ఫ్యాబ్రిక్‌ ఆభరణాలను తీర్చిదిద్దుతోంది. 

జర్మన్‌ సిల్వర్, బోహో స్టైల్‌...
ఫ్యాబ్రిక్‌ను మెడకు హారంగా, చెవులకు హ్యాంగింగ్స్‌లా సెట్‌ చేశాక మరిన్ని ఆకర్షణలు జోడించాలంటే ఏదైనా లోహాన్ని జత చేయచ్చు. అందుకు జర్మన్‌ సిల్వర్, ట్రైబల్‌ జ్యువెలరీ పీసెస్‌ను ఎంపిక చేసుకొని ఫ్యాబ్రిక్‌ జత చేయచ్చు.

చదవండి: Surbhi Puranik: హీరోయిన్‌ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top