
∙ఇస్లాం వెలుగు
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ’ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు?. ’అని ప్రశ్నించాడు.
సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్ధమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చె΄్పాలో వారికి అర్ధం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి,’నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు. ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు.
‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లాకు ముందు ఎవరున్నారు? ’అని ప్రశ్నించాడు. అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.
ఇదీ చదవండి: ఉత్తరాయణం, దక్షిణాయనం ఏది ఉత్తమం, వర్జ్యం అంటే?
‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు. ’పది తరువాత..?’ అన్నాడా బాలుడు. ‘పదకొండు..పన్నెండు..’ ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి.’ అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది.. ఎనిమిది.. ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి ΄÷య్యాడు. ‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు. ‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి. ‘..కదా..? అల్లాహ్‌కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’ అన్నాడు బాలుడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
మంచి మాటలు
మనిషి మంచివాడు కావాలంట, మంచి పనులు చేయక్కరలేదు, ఎదుటివారి గురించి ముందొక మాట, వెనుకొక మాట మాట్లాడకుంటే చాలు.!
మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం... నమ్మకం ఎంత బలపడితే నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంది.!!
కష్టాలు కన్నీళ్ళనే కాదు నిజాలను బయటకు రప్పిస్తుంది, దాపరికాల ముసుగును తొలగిస్తుంది... వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది... కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే... మనలో ధైర్యాన్ని... మన సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది... మన భవిష్యత్తుకు... గమ్యాన్ని వెతికేలా చేస్తుంది.!!
జీవితంలో ఎప్పుడూ మంచివాళ్ళను నొప్పించకు ఎందుకంటే... వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళు... చేజారితే పగిలి΄ోరు... నీ జీవితం నుండి జారిపోతారు.!!
కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి... పరుగులు తీస్తూ ఉంటాం... కానీ గుండెకు నచ్చే విషయం గురించి వెతకండి... నయనానందం క్షణికం... హృదయానందం శాశ్వతం...