breaking news
really
-
దేవుడు ఎలా ఉంటాడో తెలుసా?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ’ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు?. ’అని ప్రశ్నించాడు.సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్ధమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చె΄్పాలో వారికి అర్ధం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి,’నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు. ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు.‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లాకు ముందు ఎవరున్నారు? ’అని ప్రశ్నించాడు. అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.ఇదీ చదవండి: ఉత్తరాయణం, దక్షిణాయనం ఏది ఉత్తమం, వర్జ్యం అంటే?‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు. ’పది తరువాత..?’ అన్నాడా బాలుడు. ‘పదకొండు..పన్నెండు..’ ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి.’ అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది.. ఎనిమిది.. ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి ΄÷య్యాడు. ‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు. ‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి. ‘..కదా..? అల్లాహ్కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’ అన్నాడు బాలుడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ మంచి మాటలు మనిషి మంచివాడు కావాలంట, మంచి పనులు చేయక్కరలేదు, ఎదుటివారి గురించి ముందొక మాట, వెనుకొక మాట మాట్లాడకుంటే చాలు.!మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం... నమ్మకం ఎంత బలపడితే నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంది.!!కష్టాలు కన్నీళ్ళనే కాదు నిజాలను బయటకు రప్పిస్తుంది, దాపరికాల ముసుగును తొలగిస్తుంది... వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది... కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే... మనలో ధైర్యాన్ని... మన సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది... మన భవిష్యత్తుకు... గమ్యాన్ని వెతికేలా చేస్తుంది.!!జీవితంలో ఎప్పుడూ మంచివాళ్ళను నొప్పించకు ఎందుకంటే... వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళు... చేజారితే పగిలి΄ోరు... నీ జీవితం నుండి జారిపోతారు.!!కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి... పరుగులు తీస్తూ ఉంటాం... కానీ గుండెకు నచ్చే విషయం గురించి వెతకండి... నయనానందం క్షణికం... హృదయానందం శాశ్వతం... -
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!
దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది. స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు. 3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది. -
సంపన్న దేశాల్లో నార్వే నిజంగానే ముందుందా?
ప్రపంచ అత్యంత సంపన్న దేశాల్లో నార్వే అగ్రభాగాన నిలిచింది. వరుసగా ఏడోసారి నార్వే తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. 2015 సూచీల ప్రకారం ఆర్థిక వ్యవస్థ, విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్యం పనితీరు ప్రమాణంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల్లో నార్వే అత్యధిక స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన అన్ని విషయాల్లో ముందున్న స్విట్జర్లాండ్.. విద్యావ్యవస్థలో బలహీనంగా ఉండటంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హెల్త్ కేర్ లో 16వ ర్యాంకులో ఉన్న డెన్మార్క్..మూడో స్థానం... యూఎస్ పదకొండో స్థానాన్ని దక్కించుకోగా.. యూకె 2014-15 తో పోలిస్తే రెండు స్థానాలు కిందికి పడిపోయింది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక సంబంధాల అంశాల్లో బలహీన పడటంతో సింగపూర్ కూడ 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సామాజిక పెట్టుబడి, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్య వ్యవస్థలు బలంగా కలిగిన నార్వే ర్యాంకింగ్ విషయంలో 2009 నుంచి విజయ పథంలో దూసుకుపోతోంది. అయితే 2013 తో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది పడిపోయిందని చెప్పాలి. నిరుద్యోగ సమస్యే అందుకు ప్రధాన కారణమౌతున్నట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. లెగటమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి నాథన్ గామ్ స్టర్ అందించిన ఉత్పత్తి సూచికల ఆధారంగా... నార్వే ఎక్కువ కాలంపాటు ముందు వరుసలో నిలవడానికి కారణం.. అక్కడ నిరుద్యోగులు... వైకల్యం, లేదా ఎర్లీ రిటైర్మెంట్ పెన్షనర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం విషయంలో నార్వేలో 20-24 ఏళ్ళ మధ్య వయస్కులు మాత్రమే అధ్యయనాల్లో పాలుపంచుకున్నారు. దీంతో నార్వే అధికార నిరుద్యోగ స్థాయికంటే తక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనకారులు భావిస్తున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పొరుగు దేశాలతో పోలిస్తే నార్వేలో అధికార నిరుద్యోగ స్థాయి కృత్రిమంగా తక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. నిజానికి అధిక శాతం దేశాల్లో నిజమైన నిరుద్యోగ స్థాయిని వెల్లడించడంలేదని లండన్ మార్కెట్ ఆర్థిక వేత్త నిమా సమందజి అంటున్నారు. 2008 నుంచి ఉపాధి రేటును అధ్యయనం చేసిన ఆయన... ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడంలో ముఖ్యంగా నిరుద్యోగ స్థాయి ఆధారంగా సూచికలు నిర్థారిస్తామని, అదే నార్వేలోని నిజమైన గణాంకాలు అందుబాటులో ఉన్నట్లయితే ఆ దేశం వెనుకబడి ఉండేదని చెప్తున్నారు. చెప్పాలంటే వ్యాపారం ప్రారంభించడానికి బ్రిటన్ అత్యుత్తమ దేశం అని, వ్యవస్థాపకత విషయంలో బ్రిటన్ ఉత్తమ స్కోర్ సాధించిందని ఆయన చెప్తున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిటన్ ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను అమలు చేస్తోందని, దీంతో గణాంకాల ప్రకారం 28లో ఉండాల్సిన ఆర్థిక వ్యవస్థ 19 కి పడిపోయిందని చెప్తున్నారు. అయితే ఉపాధి విషయంలో మాత్రం అత్యధిక పెరుగుదల కనిపించిందని చెప్తున్నారు. అలాగే చైనా సంపన్నదేశాల వరుసలో 52వ స్థానంలో ఉన్నప్పటికీ... ఆర్థిక వ్యవస్థ విషయంలో ముందుంటుంది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛలో 120 స్థానంలో ఉండటం వల్లనే ర్యాంకింగ్ లో వెనుకబడుతోందంటున్నారు. సౌదీ అరేబియాలో కూడ అదే పరిస్థితి కొనసాగుతోందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఇటువంటి కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తే.. దేశాలు ఎలా విజయవంతం అవుతున్నాయో తెలుస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. -
ప్రత్యేక హోదా కోరుతూ మోదీ చిత్రపటానికి పూజలు