దగ్గు కూడా మన మంచికే..

Cough Is A Protection Purpose Of Human Body - Sakshi

నిజానికి దగ్గు అన్నది ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పటి లక్షణం కంటే... దాన్ని ఓ రక్షణ వ్యవస్థ అనడమే కరెక్ట్‌. మనం దగ్గినప్పుడు మన శ్వాసనాళాల్లోని గాలి చాలా వేగంగా ప్రవహిస్తుంది. దానివల్ల లోపలి స్రావాలు బయటకు వెళ్లిపోతాయి. అలా  దగ్గు అన్నది మనలో ఒక రక్షణ ప్రక్రియలా ఉపయోగపడుతుంది. అందుకే దగ్గును మందులతో అణచివేయకూడదు. మన ఊపిరితిత్తుల్లో స్రావాలు చిక్కబడ్డా, అక్కడ వాయునాళాల్లో ఏదైనా అడ్డుపడ్డా, మనకు దగ్గు పెరుగుతుంది. దగ్గుతో పాటు కళ్లె / కఫం పడుతుంది. అలా అవాంఛిత స్రావాలను దగ్గు బయటకు పంపించి వేస్తుంది కాబట్టే దగ్గును మందులతో అణచివేయకూడదు. 

అయితే దగ్గు వల్ల రోగికి నిద్రాభంగం అవుతున్నా, పనికి ఆటంకం కలుగుతున్నా,  హెర్నియా వంటి జబ్బులు ఉన్నా పొడి దగ్గును ఆపడానికి మాత్రమే మందులు వాడాలి. దగ్గు ఉన్నప్పుడు అది ఏ కారణంగా వస్తుందో డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుని, దేహం లోపల ఉన్న కారణాన్ని (అండర్‌లైయింగ్‌ కాజ్‌ను) కనుగొని, దానికి చికిత్స చేయించుకుంటే దగ్గు దానంతట అదే తగ్గుతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top