పని చెయ్యడం ఒక వేడుక

Celebrating Successes at Work Is Important - Sakshi

ఫలితం రావడానికి పనిచెయ్యడం ప్రాతిపదిక. ప్రయత్నం పని చెయ్యడానికి ప్రాతిపదిక. ఏ పరిణామానికైనా ప్రయత్నం, పని చెయ్యడం ఉండాలి. ప్రయత్నంతో పని చెయ్యడానికి మనిషి పూనుకోవాలి; ప్రయోజనకరమైన ఫలితాలను సాధించాలి.

‘తప్పులు జరుగుతాయన్న భయంతో పని మొదలు పెట్టక΄ోవడం చెడ్డవాడి లక్షణం; అజీర్ణం అవుతుందనే భయంవల్ల భ్రాంతిలో ఎవరు భోజనాన్ని వదిలేస్తారు? అని హితోపదేశం మాట. తప్పులు జరుగుతాయని పని చెయ్యక΄ోవడం నేరం. పని చెయ్యడం గురించి ఓషో ఇలా చె΄్పారు...

జీవితం అన్నది బాధ్యతలతో మాత్రం పని చెయ్యడమా? లేదా వేడుకలోపాలుపంచుకోవడమా? పని చెయ్యడం మాత్రమే జీవితం అయితే జీవితం ఇబ్బందికరమైనదై ఇరుకైందిగా మారి΄ోతుంది. బరువెక్కిన హృదయంతో జీవించాల్సి   వస్తుంది. కృష్ణుడు పని చెయ్యడం మాత్రమే బాధ్యత గా జీవించినవాడు కాదు. జీవితాన్ని ఒక వేడుకగా; ఒక ఉత్సవంగా మార్చుకున్నవాడు. జీవితం ఇంట్లో చదువుకునేపాఠం కాదు. జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకోవడం వల్ల ఎవరూ జీవితాన్ని కోల్పోవడం లేదు. పని చెయ్యి; ఆ పనిని వేడుకలాగా మార్చెయ్యి. అప్పుడు పని కూడా ఆటపాటల సంకలనంగా మారి΄ోతుంది. అందువల్ల చిన్నపని కూడా నిండుగా ఉంటుంది. పని సౌందర్యాత్మకం అవుతుంది.

పనికి బానిసలుగా మారినవాళ్ల గురించి మీకు తెలిసి ఉంటుంది. పని చెయ్యడం కోసం జీవించేవాళ్లు ఉద్రిక్తతలో జీవించాల్సి వస్తుంది. పని పిచ్చివాళ్లైనవాళ్లు జీవించడాన్ని ఒక కర్మాగారంగా మార్చేసు కుంటున్నారు.‘చెయ్యి లేదా చచ్చి΄ో‘ అని ఘోషిస్తున్నారు. పని చెయ్యడం తప్పితే మరో కోణం వాళ్లకు తెలీదు. వాస్తవానికి వాళ్లకు పని చెయ్యడానికి ప్రయోజనం ఏమిటో తెలియదు.
జీవితం అన్నది ఒక వేడుక. మనం పని చెయ్యడం నాట్యం చేస్తున్నట్టు ఉండాలి.

పని చెయ్యడం ద్వారా వేడుకను తీసుకురావాలి. కఠినమైన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటేపాడడానికీ, ఆడడానికీ, వేడుక చేసుకోవడానికీ సమయం లేకుండా ΄ోతుంది. జీవితం ఇంటికీ, కార్యాలయానికీ మధ్యలో ఆగి΄ోతుంది. ఈ   రెండు ప్రదేశాల మధ్యలో ముళ్లకంచెను ఏర్పరుచుకుని మానసికంగా మీరు బాధకు గురి అవుతున్నారు. ఒకరోజున జీవితంలో విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించాలని మీరు అనుకుంటారు. కానీ ఆ రోజు రాదు; పని పిచ్చివాళ్లు ఎప్పటికీ జీవితాన్ని వేడుక చేసుకోరు.

కృష్ణుడు జీవితాన్ని ఉత్సవంగా మార్చుకున్నాడు. పువ్వులు, పక్షులు, ఆకాశ తారలు జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. మనిషి తప్పితే జీవరాశులన్నీ జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. పువ్వులు ఎందుకు పూస్తూ ఉన్నాయి? అని అడగండి. తారలు ఎందుకు ఆకాశంలో తేలుతున్నాయి? అని అడగండి. గాలి ఎందుకు ఒంటరిగా వీస్తోంది? అని అడగండి. సూర్యుడికి కింద జీవిస్తున్నవి అన్నీ వేడుక చేసుకుంటున్నాయి. ప్రపంచమే వేడుక చేసుకుంటోంది. మనిషి కూడా ప్రపంచంలో భాగమే అని కృష్ణుడు చెబుతున్నాడు; వేడుక చేసుకోండి అని చెబుతున్నాడు.  

ఏ పనీ చెయ్యకుండా వేడుక చేసుకోమని కృష్ణుడు చెప్పలేదు. గాలి పని చెయ్యకుండా వీచడం లేదు. తార ఒకేచోట నుంచుని వేడుక చేసుకోవడంలేదు. అది కదులుతూనే ఉంది. పువ్వులు పుయ్యడం కూడా పనే. అయితే వీటికి పని చెయ్యడం ముఖ్యం కాదు. వేడుక ముఖ్యం. వేడుక ముందు ఉంటుంది అదే సమయంలో అవి తమ బాధ్యతల్ని కూడా నెరవేరుస్తాయి. వేడుకకు కొనసాగింపే పని; జీవితమే ఒక ఉత్సవం.

పని చెయ్యడంలోని సౌందర్యాన్ని, పని చెయ్యడంవల్ల సత్ఫలితాన్ని మనిషి సొంతం చేసుకోవాలి. పని చేస్తూ మనిషి తన జీవితాన్ని ఉత్సవం చేసుకోవాలి.

– శ్రీకాంత్‌ జయంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top