ఇళ్లల్లో నివాసం, అబ్బే కిక్కు లేదని.. అందులో ఉంటున్నాడు!

British Engineer Turns Airplane To His Dream House - Sakshi

ఇళ్లల్లో నివాసం ఉండటంలో విశేషం ఏముంది? విమానాన్నే నివాసంగా మార్చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాడు ఓ బ్రిటిష్‌ పెద్దాయన. వెతికి వెతికి ఒక కాలంచెల్లిన బోయింగ్‌ విమానాన్ని కారుచౌకగా– కేవలం 82 వేల పౌండ్లకు (రూ.81.82 లక్షలు) కొనుగోలు చేసి, దానినే తన నివాసంగా మార్చుకుని ఇటీవల వార్తలకెక్కాడు. బ్రూస్‌ కాంప్‌బెల్‌ (73) ఎలక్ట్రికల్‌ ఇంజినీరుగా పనిచేసేవాడు. 

‘విమానాలంటే నాకు చిన్నప్పటి నుంచి తగని పిచ్చి. కాలంచెల్లిన విమానాలు ప్లేన్‌ బోన్‌యార్డుల్లో (విమానాల షెడ్‌లు) పడి ఉండటంపై అడపా దడపా వార్తలు చూసేవాణ్ణి. అలాంటి వాటిలో ఒక విమానాన్ని సొంతం చేసుకోవాలని అనుకునేవాణ్ణి. ఇన్నాళ్లకు ఒక విమానాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడు దీనినే నా ఇల్లుగా మార్చుకున్నాను.

నివాసం ఉండటానికి ఇది నాకెంతో బాగుంది’ అని కాంప్‌బెల్‌ మీడియాకు చెప్పాడు. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జె.ఎఫ్‌.కెన్నెడీ భార్య జాకీ కెన్నెడీని పెళ్లాడిన అరిస్టాటిల్‌ ఒనాసిస్‌ ఒకప్పుడు ఉపయోగించిన ‘బోయింగ్‌–727’ విమానం 1999 నుంచి గ్రీస్‌లో పడి ఉన్నట్లు తెలుసుకుని, దీనిని కొనుగోలు చేశాను’ అని కాంప్‌బెల్‌ వివరించాడు.

విమానం ధర 82 వేల పౌండ్లు అయినా, గ్రీస్‌ నుంచి తాను నివాసం ఉంటున్న ఓరెగాన్‌కు దీనిని తరలించడానికి 99 వేల పౌండ్లు (రూ.98.83 లక్షలు) ఖర్చు కావడం విశేషం.

చదవండి: స్టార్టప్‌లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్‌ స్టార్లు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top