Grapes: ద్రాక్షపండ్ల ప్యాక్‌ వేసుకుంటున్నారా... వీటిలోని ఆంథోసైయనిన్ వల్ల..

Beauty Tips In Telugu: Grapes Pack Will Help Get Oily Free Skin - Sakshi

గ్రేప్స్‌తో గ్లో!

ప్రస్తుతం మార్కెట్లో పుష్కలంగా దొరుకుతున్న ద్రాక్షపండ్లలో విటమిన్‌ ఎ, సి, బీ 6, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి పోషణ అందించేవి. గ్రేప్స్‌ను ఆహారంగా లేదా ఫేస్‌ ప్యాక్‌ రూపంలో తీసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

వీటిలోని ఆంథోసైయనిన్(నీటిలో కరిగే కలర్‌ పిగ్మెంట్‌), యాంటీ ఆక్సిడెంట్‌లు ముఖం మీద మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను తొగిస్తాయి. యాంటీ ఏజింగ్‌ మూలకంగా కూడా గ్రేప్స్‌ బాగా పనిచేస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న ద్రాక్షతో ఇంట్లోనే సులభంగా ఫేస్‌ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం....

చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

ఆయిలీ స్కిన్‌..
జిడ్డుతత్వం ఉన్న చర్మానికి కూడా గ్రేప్స్‌ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డుపోతుంది.
పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి.
ఈ పేస్టులో టేబుల్‌ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంటపాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

పొడి చర్మానికి..
మూడు స్ట్రాబెర్రీలు, ఐదు ద్రాక్షపండ్లను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని దూదితో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖచర్మానికి ఇన్‌స్టంట్‌ మాయిశ్చర్‌ని అందించడంతోపాటు మృదువుగా మారుస్తుంది.
చర్మతత్వాన్ని బట్టి వీటిలో ఏ ప్యాక్‌ను అయినా వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది.  

చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్‌ వల్ల..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top