అతియా, అనుష్కాలు ధరించిన టాప్‌ ధర వింటే..షాకవ్వాల్సిందే!

Anushka Sharma And Athiya Shetty Both Wore This Bright Malie Top - Sakshi

సెలబ్రెటీలు ధరించే డ్రెస్‌లు ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. వాటి ధర కూడా ఖరీదుగానే ఉంటాయి. క్రికెటర్లనే పెళ్లి చేసుకున్న భాలీవుడ్‌ భామలు ఇద్దరూ ఒకేలాంటి స్లీవ్‌లె్లెస్‌ టాప్‌లు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టి క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ని గత నెలలో పెళ్లిబంధంలో ఒక్కటయ్యారు. ఇక అనుష్కా క్రికెటర్‌ విరాట్‌ని కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి వామిక అను కూతురు కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు ఒకే బ్రాండ్‌ మాలీకి చెందిన దుస్తులు ధరించారు. అందులో ఇద్దరు తమ అందంతో చూపురులను కట్టిపడేశారు. అయితే వారు ధరించి ఆ షార్ట్‌ టాప్‌ల ధర వింటే షాకవ్వడం ఖాయం.

సెలబ్రెటీలు దరించేవి చాలా ఖరీదైనవే అయినప్పటికీ..కొన్ని దుస్తులుకు ఇంతపెట్టారా అనే ఫీల్‌ వస్తుంది. అది సహజం. ఏ చీర లేదా లెహంగా అంత ధర ఉందంటే ఓకే చిన్న షార్ట్‌ లాంటి టాప్‌ ఏకంగా రూ. 18000/ అంటే నిజమేనా? అనిపిస్తుంది కదా! కానీ బ్రాండ్‌లకు పెట్టింది పేరు అయిన మలై బ్రాండ్‌ ధరలు ఎక్కువనే చెప్పాలి. ఆయా ఫ్యాషన్‌ కాస్ట్యూమ్‌లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అతియా శెట్టి గూలాబీ రంగు స్లీవ్‌లెస్‌ టాప్‌, జీన్స్‌ ఫ్యాంట్‌లో అదర్సు అన్నట్లు ఉంది.

చక్కటి ఈయర్‌ రింగ్స్‌, ‍మ్యాచింగ్‌ లిప్‌స్టిక్‌తో మంచి లుక్‌తో ట్రెండీగా ఉంది అతియా. ఇక అనుష్క శర్మ కూడా సేమ్‌ అదే మాదిరి పసుపు రంగు టాప్‌లో చూడచక్కగా ఉంది. కంఫర్ట్‌ ‍దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చే అనుష్క రెండు నెలల క్రితం ఈ టాప్‌ని ధరించిన ఫోటోని నెట్టింట షేర్‌ చేసింది. ఇప్పుడూ అతియా అదే టాప్‌ వేసుకోవడంతో నెలక్రితం నాటి అనుష్క ఫోటోతో కలిపి అతియా ఫోటో నెట్టింట సందడి  చేయడం. దీంతో నెటిజన్లు మీ భుజాలను కవర్‌ చేసేలా డ్రస్‌లు వేయకూడదనుకుంటున్నారా అంటూ సెటైరికల్‌ కామెంట్లతో పోస్ట్‌లు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. 

(చదవండి: పండుగ వేళ ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top