రోగనిరోధక శక్తి గురించి హెచ్చరించే లక్షణాలు

5 Warning Signs That Indicate You have A Weak Immune System - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యింది. ఇంటి, ఒంటి శుభ్రతతో పాటు తినే ఆహారంలో కూడా తగన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు బయటి ఆహారాన్నే ఇష్టపడ్డవారు సైతం ఇప్పుడు ఇంటి భోజనమే బెటర్‌ అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మన శరీరం చూపే కొన్ని లక్షణాలను బట్టి మన రోగనిరోధక శక్తి బలంగా ఉంది లేనిది అనే దాని గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో చూడండి.. (చదవండి: నాటుకోడి నోరూరిస్తోంది..!)

తరచు జలుబు, దగ్గు..
తరచుగా జలుబు చేసినా.. గొంతులో చిరాకుగా ఉండి దగ్గు సూచనలు కనిపించినా మీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు గనక సంవత్సరంలో నాలుగు సార్లకంటే అధికంగా దగ్గు, జలుబు వచ్చాయంటే మీ ఇమ్మూనిటీ లెవల్స్‌ బలహీనంగా ఉన్నాయని అర్థం. 

నిద్ర లేచాక.. భారంగా ఉంటుందా..
రాత్రి నిద్రపోయాక తరచుగా మెలకువ వస్తుందా.. అలానే 7-8 గంటలు నిద్ర పోయి లేచిన తర్వాత కూడా మీకు భారంగా అనిపిస్తుందా. ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే.. మీ రోగ నిరోధక శక్తి ప్రమాదంలో ఉన్నట్లే.

తరచుగా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడం..
మీరు బయట ఆహారం తిన్నారు.. కడుపులో అనిజీగి ఉందా. అయితే మీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లే. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మిగత శరీర భాగాలు కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. 

గాయాలు నెమ్మదిగా నయమవుతున్నాయా..
దెబ్బ తగిలినప్పుడు.. కాలినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఆ గాయాలు మానిపోతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటే.. గాయాలు నెమ్మదిగా మానితే.. మీ రోగనిరోధక శక్తి మందగించిందని అర్థం. అంతేకాక మీ శరీరం, చర్మాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అందించడం లేదనడానికి గుర్తు.

తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా..
మీరు జలుబు, దగ్గుతో పాటు మూత్ర, చెవి, సైనస్‌ సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే ఇమ్యూనిటీ వీక్‌గా ఉందని అర్థం. మీ రోగనిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేసిన వైరస్‌లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తగినన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేకపోతుందనడానికి ఇది సంకేతం.

ఈ పైలక్షణాలు మీకు కనిపిస్తే.. వెంటనే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వ్యాయమాలు చేయడం ప్రారంభించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top