రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక సోమేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.11.02 లక్షలు జై భారత్‌ క్షీరారామ ఆక్వా సంఘ అధ్యక్షుడిగా బోణం

ముసునూరు : రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు రమణక్కపేట జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థినులు ఇందుప్రియ, భార్గవి ఎంపికై నట్లు హెచ్‌ఎం పీవీఎస్‌ రామకృష్ణారావు తెలిపారు. ఈ నెల 1న విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో జరిగిన బాస్కెట్‌ బాల్‌ సెలెక్షన్లలో అండర్‌–16 విభాగంలో తమ విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరు విజయవాడ పటమట జెడ్పీ హైస్కూల్లో జరుగనున్న పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాస్కెట్‌ బాల్‌ జట్టు తరుఫున పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు ఎంపికై న విద్యార్థినులను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దస్వామి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. 112 రోజులకుగాను రూ. 11,02,607 ఆదాయం లభించింది. విదేశీ కరెన్సీ 4 డాలర్లు ఉన్నాయి. స్వామివారి శాశ్వత నిత్యాన్నదానంనకు రూ.31,045 ఆదాయం వచ్చింది. దేవదాయ ధర్మాదాయ శాఖ భీమవరం తనిఖీ దారు పీఎస్‌ సాయికుమారి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చింతలపాటి బంగార్రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు జై భారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన బోణం చినబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పూలపల్లి ఎస్‌ఎస్‌ఎస్‌ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గాంధీ భగవాన్‌రాజు, నూతన అధ్యక్షుడు బోణం చినబాబు, సెక్రటరీ సత్యనారాయణరాజు, ట్రెజరర్‌ సోంబాబు, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ గత మూడేళ్లుగా పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల ఆక్వా రైతు సంఘం ఏర్పాటుచేసి ఎనలేని పోరాటం చేస్తున్న గాంధీ భగవాన్‌రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం అభినందనీయమని అన్నారు. జై భారత్‌ క్షీరారామ ఆక్వా నూతన సంఘం కూడా గాంధీ భగవాన్‌రాజు బాటను అనుసరిస్తూ ఆక్వా రైతుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. అలాగే శుక్రవారం లంకలకోడేరు గ్రామంలో ఎంపెడా ఆధ్వర్యంలో జరగనున్న అవగాహనా సదస్సుకు ఆక్వా రైతులు హాజరుకావాలన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement