బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు

తణుకు అర్బన్‌: మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు తణుకు ఆంధ్రా సుగర్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ ది ఆంధ్రా సుగర్స్‌ లిమిటెడ్‌ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గాను, రాజకీయ రంగంలో నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బుల్లిరామయ్య అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఉద్యోగులకు మిఠాయిలు పంచారు. సంస్థ అడిషనల్‌ సెక్రటరీ పీవీఎస్‌ విశ్వనాధకుమార్‌, జనరల్‌ మేనేజరు (హెచ్‌ఆర్‌) ఎ.సాంబశివరావు, వివిధ విభాగాల అధిపతులు, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement