● నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా
● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఏలూరు (టూటౌన్): తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు మరోసారి పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ నెల 10న ఏలూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
● సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్‌వాడీలకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలి.
● అంగన్‌వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు, గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి.
● మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్‌కు 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి.
● అంగన్‌వాడీలకు ‘తల్లికి వందనం’ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.
● సిగ్నల్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్) ఫేస్ యాప్‌ను, పనిభారం పెంచే నవచేతన యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి. పెండింగ్‌లో ఉన్న టీఏ, మెయింటినెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.


