న్యూస్‌రీల్
నాడు ఆక్వాకు వైభవం
‘హైస్కూల్ ప్లస్’.. నిర్వీర్యం
ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అశ్రద్ధ వెరసి గ్రామీణ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ‘హైస్కూల్ ప్లస్’ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. 8లో u
రైతులకు సిరులు కురిపించే అక్షయపాత్రగా రొయ్యల సాగుకు పేరుంది. దేశవ్యాప్తంగా రవాణా అవుతున్న రొయ్యల ఉత్పత్తులలో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నాయి. సింహభాగం ఉమ్మడి పశ్చిమగోదావరి, కొల్లేరు ప్రాంతాలు ఉన్నాయి. చదువుతో పనిలేకుండా ఆక్వా రైతులు ఆధునిక పద్ధతుల్లో ఆక్వా సాగు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆక్వారంగం చంద్రబాబు పాలనలో కుదేలైంది.
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
కై కలూరు: ఏలూరు జిల్లాలో చేపల, రొయ్యల సాగు 1.49 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇందులో సుమారు 30,000 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. జిల్లాలో వార్షిక ఉత్పత్తి 12.49 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. జిల్లాలో ప్రధానంగా కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, భీమడోలు, దెందులూరు, పెదపాడు మండలాల్లో సాగు అధికంగా ఉంది. గత ఎన్నికల ప్రచారంలో సైతం మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని నాయకులు నమ్మబలికారు. ముఖ్యంగా కొల్లేరు లంక గ్రామాల్లో ప్రజలకు కోటి ఆశలు కల్పించారు. నేడు రొయ్యల మేత ధరలను ఇష్టానుసారంగా కంపెనీలు పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
విద్యుత్ సబ్సిడీ ఏక్కడ?
చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య ఆక్వా యూనిట్ విద్యుత్ సబ్సిడీ రూ.3.85 ఉండేది. తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.2కి తగ్గించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 2019–24 మధ్య యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సబ్సిడీ ఊసు లేకపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి, రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. సబ్సిడీలో రైతులను పొమ్మనలేక పొగపెట్టడానికి పవర్ ఫ్యాక్టర్(పీఎఫ్) రూల్‌ను చేర్చారు. ఏలూరు జిల్లాలో మొత్తం 13,007 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 9,555 కనెక్షన్లకు సబ్సిడీ అందించారు. కూటమి పాలనలో ప్రస్తుతం 3,452 మంది రైతులకు సబ్సిడీ అందించాల్సి ఉంది. పీఎఫ్ నిబంధన నెరవేరాలంటే ఎకరాకు రూ.లక్షన్నర ఖర్చుతో కెపాసిటర్ల భారాన్ని ఆక్వా రైతులు భరించాల్సి వస్తోంది. ఫీడ్ కంపెనీలు మేతల ధరలను పెంచితే ఊరుకునేదే లేదని పలు సభల్లో గొంతెత్తిన కొందరు నాయకులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో నోరు మెదపడం లేదు. కనీసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల మేతల ధరల పెంపుపై తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నాయకులు ముఖం చాటేశారు. కూటమితో అంటకాగుతున్న నాయకులు పార్టీపరంగా వ్యవహరించడంపై అనేక మంది గుర్రుమంటున్నారు. సమస్యను కేవలం పార్టీలు, ప్రాంతాలకు పరిమితం చేయకుండా కలసికట్టుగా పోరాడాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్వారంగానికి వైఎస్సార్‌సీపీ పాలన స్వర్ణయుగం. 2018–19లో రాష్ట్రంలో 38 లక్షల టన్నులుగా ఉన్న రొయ్యల, మత్స్య ఉత్పత్తులు, 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. ఆక్వారంగంలో విశేష ప్రతిభకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఒడిశా, భువనేశ్వర్, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఔత్సాహిక రైతులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్వా రైతుల సాంకేతికతను అందుపుచ్చుకున్నారు. నేడు రివర్స్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ ధర దాదాపు రూ.16 వరకు పెరిగింది. జూన్ 13న టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. మే 11న ధరల పెంపునకు పచ్చజెండా ఊపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 100 కౌంట్ రొయ్యల ధర రూ.245 ఉంటే, నేడు ఇదే ధర రూ.225కి పడిపోయింది.
ఆకాశాన్నంటిన మేత ధరలు
నేల చూపులు చూస్తున్న రొయ్య రేట్లు
మేత కంపెనీలకే ప్రభుత్వ పెద్దల మద్దతు
అప్సడా, క్వాలిటీ కంట్రోల్ యాక్టులకు తూట్లు


