కేసుల ఛేదనలో ఏఐ కీలకం | - | Sakshi
Sakshi News home page

కేసుల ఛేదనలో ఏఐ కీలకం

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

ఏలూరు టౌన్‌: పోలీస్‌ వ్యవస్థలో నిందితులకు శిక్షలు విధించడంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనా లు కీలకమని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ అధ్యక్షతన పోలీస్‌ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌ను శనివారం ఏలూరులో నిర్వహించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జి ల్లాల పోలీస్‌ అధికారులు హాజరయ్యారు. ఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ పోలీస్‌ విధుల్లో దర్యాప్తు, కోర్టు విచారణల రిపోర్టుల తయారీలో ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో ఎస్పీ శివకిషోర్‌ ఆధ్వర్యంలో ఏఐని వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధించటం అభినందనీయమని, ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఏఐ టూల్స్‌ను వినియోగించాలన్నారు.

20 శాతం పెరిగిన కేసుల పరిష్కారం

ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ ధర్మా (డిజిటల్‌ హాలీస్టిక్‌ ఏఐ డ్రైవెన్‌ రెస్పాన్స్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌) యాప్‌ను రూపొందించటంలో స్మా ర్ట్‌ పోలీసింగ్‌కు కృషి చేశామన్నారు. ధర్మా యాప్‌ పోలీస్‌ విధి నిర్వహణలో ఏఐ ఆధారిత సహాయక వేదికగా పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే కేసుల పరిష్కారం 20 శాతం పెరిగిందనీ, ఏకంగా 2,344 కేసులు పరిష్కారం కావటం విశేషమన్నారు. నేరాలకు సంబంధించి ఫొటోలు, సాక్ష్యా లు, చార్జిషీట్లు, ప్రకటనలు వంటి అంశాల్లో ఏఐ విశ్లేషణలతో దర్యాప్తులో కచ్చితత్వం మరింత పెరిగిందన్నారు. జిల్లాలో అన్ని స్టేషన్లలో ఏఐ టూల్స్‌ వినియోగించేలా పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఎస్పీ శివకిషోర్‌ చెప్పారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, సీఐలు ఎం.సుబ్బారావు, వి.రవికుమార్‌, కె.రామకృష్ణ, సీహెచ్‌ రాజశేఖర్‌, ఎంవీ సుభాష్‌, బోణం ఆదిప్రసాద్‌, వెంకటేశ్వరరావు, ఎస్సైలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఐజీ అశోక్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement