● ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల జాబితా విడుదల
● 4,040 సీట్లకు కౌన్సెలింగ్
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికవ్వగా, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 24 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.


