కై కలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. తొలి అడుగు పేరుతో కొల్లేరు నాయకుడు బలే ఏసురాజు ఆధ్యరంలో కై కలూరు సీతారామఫంక్షన్ హాలులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు గ్రామ పెద్దలతో మంగళవారం సమావేశం నిర్వహ/ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ త్వరలో సుప్రీంకోర్టు నుంచి శుభవార్త వస్తుందని భావిస్తోన్నామన్నారు. ఫోన్‌లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌తో మాట్లాడించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో కొల్లేరుపై చర్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా అటవీశాఖ అధికారి త్రిమూర్తులురెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తదితరుల పాల్గొన్నారు.


