యలమంచిలి: భీమవరం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఉన్న ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా నూతన భవనాన్ని ఈ నెల జూన్ 10న ప్రారంభిస్తున్నట్లు సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు షేక్ ఉమర్ అలీషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ పాల్గొంటారన్నారు.
నూజివీడు: పట్టణంలోని ఏడుమెట్ల బావి సెంటర్‌లో అద్దె ఇంట్లో ఉండే షేక్ మహబూబ్ సుభానీ(35) ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన షేక్ మహబూబ్ సూబానీ నాలుగేళ్ల క్రితం నూజివీడు వచ్చి డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అనారోగ్య సమస్యలతో పాటు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోని వారు సోమవారం ఉదయం చూసి పట్టణ పోలీసులకు తెలపడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దింపించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కైకలూరు: అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రీహరిపురం గ్రామానికి చెందిన శొంఠి రవీంద్ర బెయిల్‌పై సోమవారం విడుదలయ్యాడు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన నేత కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ గొడవలో హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఇందుకు కారణం వైఎస్సార్‌సీపీ కార్యకర్త రవీంద్ర అంటూ అదే రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన రవీంద్ర నాయకులతో కలసి కై కలూరు పార్టీ కార్యాలయంలో డీఎన్నార్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చిన పార్టీ అండగా ఉంటుందని డీఎన్నార్ చెప్పారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): రైలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు వెల్లడించారు. తాడేపల్లిగూడెం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి వద్ద ట్రాక్ సమీపంలో 40–45 ఏళ్ల వయసున్న పురుషుడు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని రైలు ఢీకొని మరణించినట్లు తెలిపారు. 5 అడుగుల ఎత్తు, నలుపు, తెలుపు రంగు షర్ట్, నీలం రంగు షార్ట్, బనియన్ ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలపారు.
భీమవరం: దాడి ఘటనపై పరస్పర ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రెహ్మాన్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ రాత్రి రాయలం గ్రామంలో ఉన్న తన స్నేహితుడు తరుణ్‌కు టిఫిన్ ఇవ్వడానికి వెళుతుండగా భాస్కర దుర్గాప్రసాద్, మరో ఐదుగురు దాడి చేశారని పండ్ల నందకిషోర్ ఫిర్యాదు చేశాడు. తాను పశువుల పాక దగ్గరకు వెళ్లి వస్తుండగా నందకిషోర్ దాడి చేశాడని భాస్కర దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేశాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


