అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
రెండేళ్లలో చేసిందేమీ లేదు
నూజివీడు: వైఎస్సార్‌సీపీ సదస్సులో మాట్లాడుతున్న నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
గణపవరం: ఉంగుటూరు మండలం నారాయణపురంలో జరిగినసదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ అరాచకాలను పోస్టర్ ద్వారా వివరిస్తున్న పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
గణపవరం (ఉంగుటూరు)/నూజివీడు/బుట్టాయగూడెం/ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ రెండేళ్ల దగా పాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో ని పలు నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలును విస్మరించడంపై నాయకులు నిలదీశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దౌర్జన్యాలను పోస్టర్లు, ఫొ టో గ్యాలరీల ద్వారా వివరించారు.
ఉంగుటూరు మండలం నారాయణపురం కమ్మ కల్యాణ మండపంలో పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విచ్చలవిడి గా ప్రజాధనాన్ని వృథా చేస్తూ విమానాలు, హెలికాప్టర్‌లపై చక్కర్లు కొడుతూ ఇచ్చిన హామీలను, పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. కూటమి నాయకులు పొదుపుపై ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళనలకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందన్నారు. అధికార పార్టీ నాయకులు మట్టి, మద్యం, ఇసుక, కాంట్రాక్టులతో అందినకాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఏఎస్ రాజు మాట్లాడుతూ కూటమి రెండేళ్ల పాలనలో ఒక్క కొత్త సామాజిక పింఛను మంజూరు చేయలేదన్నారు. కూటమి అరాచక పాలనపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. కూటమి ఎగ్గొట్టిన హామీల ప్లకార్డులను ప్రదర్శించారు. ముందుగా కూటమి అరాచక, రెడ్‌బుక్ పాలనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్‌లు ఎగురవేశారు. ప్రభుత్వ దుర్మార్గాలను తెలిపే ఫొటో గ్యాలరీని పార్టీ నేతలు తిలకించారు. నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు మరడ మంగారావు, దండు రాము, సంకు సత్యకుమార్, రావిపాటి శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
గణపవరం: నారాయణపురం సదస్సులో కూటమి హామీల ప్లకార్డులు చూపుతూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ఏలూరు టౌన్: నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్
గళమెత్తి.. గర్జించి..
హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏదంటూ ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశాల్లో నాయకుల నిలదీత
మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, డీఎస్సీలో అవినీతి, అవకతవకలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. నూజివీడు పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడమే కాకుండా మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలకు, అవినీతికి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. క్రీడా కోటా పేరుతో డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చి అవకతవకలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. దీనివల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మామిడి, మొక్కజొన్న రైతులు నష్టపోతున్నా వారిని ఆదుకుందామనే ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు. ఆగిరిపల్లి మండలంలో కొండలన్నింటినీ కొల్లగొడుతూ మట్టి, గ్రావెల్‌ను దోచుకుంటున్నారన్నారు. పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నూజివీడు పట్టణ, ముసునూరు, చాట్రాయి మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, మూల్పురి నాగవల్లేశ్వరరావు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి తదితరులు ప్రసంగించారు. నాయకులు వెంకట సుబ్బ య్య, ఆగిరిపల్లి బెజవాడ రాంబాబు, మలిశెట్టి బాబీ, అత్తి మురళీ, బసవా రామకృష్ణ, మందాడ శివశంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన సమయం వచ్చిందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఈనెల 12న కన్నాపురం నుంచి కొయ్యలగూడెం వరకూ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియ జేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పాటుపడాలన్నా రు. ప్రతిఒక్కరికీ తాను అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ మండల కన్వీనర్లు అల్లూరి రత్నాజీరావు, చందా ప్రసాద్, తుమ్మలపల్లి గంగరాజు, బుగ్గా మురళి, ఎస్‌పీవీఎస్ రాజు, ఎంపీపీలు తెల్లం రమణ, సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, దాసరి విష్ణు, రాష్ట్ర కార్యదర్శి మంతెన సోమరాజు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, నాయకులు తాళ్లూరి ప్రసాద్, బానోతు కృష్ణ నాయక్, బగ్గి దినేష్, ఏలేటి చంద్రం తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్
టీడీపీ కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిం దేమీ లేదనీ, సూపర్ సిక్స్ హామీలకే దిక్కులేదనీ, ఇంక మేనిఫెస్టో అమలు చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైఫల్యాలపై సదస్సు నిర్వ హించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలోని 143 హామీలను నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. సూపర్‌సిక్స్‌లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. గద్దెనెక్కి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేక చేతులెత్తేశారనీ, కేవలం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించటం, అక్రమ కేసులు పెట్టడం, దాడులు, దౌర్జన్యాలు చేయటం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే అన్నారు. ప్రస్తుతం అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనీ వ్యవసాయం చేయలేని దుస్థితిలోకి వెళ్లారన్నారు. పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నాయకులు గంటా మోహనరావు, కొల్లిపాక సురేష్, చిలకపాటి డింపుల్, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్, గాజుల బాజీ, దాసరి రమేష్, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


