ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 18 రోజులు.. రూ.2.42 కోట్లు 11న బీసీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన నవచేతన యాప్‌పై శిక్షణ

నూజివీడు: ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియలో భాగంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారంతో ముగిసింది. చివరి రోజు పరిశీలనకు ఎన్‌సీసీ కోటాలో 305 మందికి 185 మంది, క్యాప్‌ కోటాలో 55 మందికి 42 మంది, స్పోర్ట్స్‌ కోటాలో 119 మందికి 90 మంది, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాలో 282 మందికి 195 మంది హాజరయ్యారు. ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీ నారాయణరావు, నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ఆచార్య గోపాల రాజు, ఏవో లక్ష్మణరావు, అకడమిక్‌ డీన్‌ సాదు చిరంజీవి పరిశీలించారు. మొత్తంగా 761 మంది అభ్యర్థులకు 512 మంది సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్‌ పర్యవేక్షించగా డీఎస్‌డబ్ల్యూఓ రాజేష్‌, గణిత అధ్యాపకులు సతీష్‌కుమార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అర్జునరావు పాల్గొన్నారు.

చిన వెంకన్నకు కాసుల పంట

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆ లయ హుండీల ఆదాయాన్ని సోమవారం దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్‌వీ చందన పర్యవేక్షణలో లెక్కించారు. 18 రోజులకు నగదు రూపేణా రూ.2,42,55,625 ఆదాయం లభించి నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలి పారు. కానుకల రూపేణా 191 గ్రాముల బంగారం, 3.274 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.1,000, రూ. 500 నోట్ల ద్వారా రూ.8 వేలు లభించినట్టు చెప్పారు. సగటున రోజుకు శ్రీవారికి రూ.13,47,535 ఆదాయం లభించినట్టు ఈఓ చెప్పారు.

ఏలూరు (టూటౌన్‌): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఈనెల 11న జిల్లాలో పర్యటించనున్నారని, బీసీలు తమ వాణి వినిపించాలని బీసీ కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యాదవ సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు, బీసీ డిమాం డ్లను వినతిపత్రాల ద్వారా కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు లంక వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కార్యదర్శి ఎ.మురళి, సైదు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండో రోజు నవచేతన యాప్‌పై ఈదర సుబ్బమ్మదేవి స్కూల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీడీపీఓ ఎ.పద్మావతి మాట్లాడుతూ యాప్‌ ద్వారా స్క్రీనింగ్‌ ఎలా చేయాలి, ఎదుగుదల స్థాయిని ఎలా గుర్తించాలి అనే అంశాలను వివరించారు. పిల్లల్లో శారీరకంగా మానసికంగా, అభివృద్ధిని ఎలా గమనించాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఆరేళ్లలోపు పిల్లలను సర్వే చేయాల్సి ఉందన్నారు. డాక్టర్‌ ప్రదీప్‌ చంద్ర, సూపర్‌వైజర్లు మంగ, జోషి, మీనాక్షి, సత్య, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement