ఏలూరు టౌన్: మెగా డీఎస్సీ–25పై అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారనీ, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నేతలు సోమవారం జేసీ అభిషేక్ గౌడ్‌కు వినతిపత్రం సమర్పించారు. పరీక్షల నిర్వహణలో లీకేజీలు, అవకతవకలు, అధికార దుర్వినియోగం అభ్యర్థులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయనీ వారిలో విశ్వాసాన్ని కల్పించేందుకు విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్ మాట్లాడుతూ డీఎస్సీ–25లో ప్రశ్నాపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేస్తూ ఉద్యోగ నియామకాలు, సర్టిఫికెట్ల పరిశీలనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద నిరుద్యోగ అభ్యర్థు ల ఆశలపై నీళ్లు చల్లుతూ అన్యాయం జరిగిందనే అ భియోగాలపై విచారణ చేపట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నిరుద్యోగ యువత పక్షాన పోరాటం చేస్తామన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు ఇనపనూరి జగదీష్ ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నేతలు


