ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లలో 348 అర్జీలు స్వీకరించి నట్టు జేసీ ఎంజె అభిషేక్ గౌడ తెలిపారు. ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్ డీఆర్వో ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, జిల్లా పంచాయతీశాఖ అధికారి జి.మల్లికార్జురావు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● భీమడోలు మండలం అర్జవారిగూడేనికి చెందిన గండి రాఘవులు బియ్యం కార్డు ఆన్‌లైన్ కోసం అర్జీ అందించారు.
● పెదవేగి మండలం రాట్నాలకుంటకు చెందిన ఉల్లిబోయిన రాజేష్ తన భూమి 22ఏలో నమోదైందని, తొలగించాలని కోరారు.
● లింగపాలెం మండలం సింగగూడేనికి చెందిన శికాకొల్లు అనురాధ తన కుమార్తెకు మిషన్ వాత్సల్య పథకం వర్తింపజేయాలని కోరారు.
● ఏలూరు అమీనాపేటకు చెందిన పుప్పాల ముకుందరావు ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ సంఘానికి చెందిన నిధులను ప్రెసిడెంటు, కార్యదర్శి స్వాహా చేశారని, రికవరీ చేయాలని అర్జీ అందించారు.
● వేలేరుపాడు మండలం మద్దిగట్లకి చెందిన సొందే భూబమ్మ తన భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేశారు.


