బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం గానుగమామిడి నుంచి రేగులపాడు, రేపల్లె గ్రామాలకు రోడ్డు నిర్మాణ పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చినట్టు జంగారెడ్డిగూడెం అటవీశాఖ రేంజ్ అధికారి వి.దుర్గాకుమార్ బాబు తెలిపారు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురించిన ‘దారీతెన్నూలేదు’ శీర్షికన కథనానికి స్పందించారు. లంకపాకల, డోలుగండి జంక్షన్ నుంచి రేగులపాడు రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనను ఉన్నతాధికారులు అనుమతించారన్నారు. అయితే కొమ్మలు కత్తిరించడం వంటి పనులు జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారి లేదా ఆయన ప్రతినిధి పర్యవేక్షణలో చేయాలన్నారు. అలాగే నిర్మాణ పనులనూ పర్యవేక్షించాల్సి ఉందన్నారు. నిబంధనల మేరకే రోడ్డు పనులు చేస్తారన్నారు. నిబంధనల మేరకే అటవీ శాఖ కూడా అనుమతులు ఇస్తుందన్నారు. అలాగే ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో ఫినిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు.


