ఏలూరు (టూటౌన్): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల ఉపాధి పో గొట్టే స్మార్ట్ కిచెన్‌లు రద్దు చేయాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం 23 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకేచోట వండి స్కూల్‌కు క్యారేజీలు పంపాలని నిర్ణయించడంతో వేలాది మంది కార్మికుల ఉపాధి పోతుందన్నారు. ఇప్పటికే పలు సమస్యలతో తాము పథకాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు అన్యాయంగా తొలగించా లని చూడటం దుర్మార్గమన్నారు. పథక కార్మికులకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని, ప్రతినెలా 5లోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలనీ, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనీ, రెండు జతల యూనిఫాం, గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పోసమ్మ మద్దతు తెలిపారు.


